ఆ దినపత్రికను టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోందా?
ఆంధ్రజ్యోతి అంటే టిడిపి, టిడిపి అంటే ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకి చంద్రబాబుకి అవినాభావ సంబంధం ఉంది. రాధాకృష్ణ చంద్రబాబుని హైలెట్ చేస్తూ ప్రతి పక్షాలను విమర్శిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కానీ, పేపర్ కానీ నడుపుతాడని అనేది అందరూ అనుకునే మాట. ఇక తెలంగాణాలో టిడిపి కుదేల్ అయినప్పటికీ... టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా ఆంధ్రజ్యోతి పని చేస్తుంది. టిడిపికి కొమ్ముకాసే రామోజీరావు అదేనండి ఈనాడు పత్రిక అధినేత కూడా తెలంగాణ సపరేట్ రాష్ట్రమయ్యాక కేసీఆర్‌కి తల వంచాడు. అందుకే ఈనాడు పేపర్‌ని కేసీఆర్ ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. కానీ ఆంధ్రజ్యోతిని కేసీఆర్ ఎప్పుడో టార్గెట్ చేసినా... మళ్ళీ రీసెంట్‌గా జరిగిన ఎన్నికల కోసం వదిలేశాడు. అందుకే గవర్నమెంట్ యాడ్స్ అవీ జ్యోతి పేపర్‌కి బాగానే అందేవి.
కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆంధ్రజ్యోతి పేపర్‌కి కష్టకాలం మొదలైనట్లే కనబడుతుంది. ఎందుకంటే తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో స్వీప్ చేసి 89 స్థానాలను గెలిచి... మళ్ళీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే తెలంగాణ పరిపాలనను చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్‌లో, ఇండిపెండెంట్స్‌గా గెలిచినవారు కూడా టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో మెజారిటీతో గెలిచిన కేసీఆర్ ఇక తన ప్రతాపం చూపించబోతున్నాడు. ఇప్పటికే చంద్రబాబుని బహిరంగంగా టార్గెట్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేశాడనిస్తుంది.
ఎందుకంటే మిగతా అంటే ఈనాడు, సాక్షి ఇలా అన్ని పేపర్స్‌కి గవర్మెంట్ అండ్ టీఆర్‌ఎస్ నాయకులు ఇచ్చే యాడ్స్ ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఆగిపోయాయి. మిగతా పేపర్స్ అన్నీ కేటీఆర్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా అనేకమంది టీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న మెయిన్ పేజ్ యాడ్స్‌తో కళకళలాడుతుంటే.. ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రం యాడ్స్ లేకుండా వెలవెలబోతోంది. మరి ఈ లెక్కన ఆంధ్రజ్యోతికి తెలంగాణాలో స్టార్ట్ అయ్యిందిరో అంటూ టీఆర్ఎస్ నేతలే బహిరంగంగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి ఈ పరిస్థితుల్లో ఎండి రాధాకృష్ణ ఏ మార్గాన్ని అనుసరిస్తాడో.. చూద్దాం.
By December 17, 2018 at 05:39PM
No comments