Breaking News

వర్మ, పూరి, మారుతి.. ఇప్పుడు శ్రీకాంత్


రహస్యం ప్రమోషనల్ పోస్టర్‌ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్ 

భీమవరం టాకీస్ నుంచి సినిమా వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్ లు సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఎందుకంటే తుమ్మలపల్లి రామసత్యనారాయణ సేఫ్ బడ్జెట్‌లో క్వాలిటీ  సినిమాలు నిర్మిస్తారు. వంద సినిమాల చేరువలో ఉన్న భీమవరం టాకీస్ ఇప్పుడు రహస్యం చిత్రం‌తో రాబోతోంది. సాగర్‌ శైలేష్, శ్రీ రితిక జంటగా ‘జబర్దస్త్‌’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రహస్యం’. సాగర్ శైలేశ్‌ దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. టాప్ డైరెక్టర్స్ అయిన రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్ మరియు మారుతీ ఈ సినిమా యొక్క ట్రైలర్లు విడుదల చేసి ఈ సినిమా విజయవంతం అవ్వాలని అభినందించారు. ఇప్పుడు హీరో శ్రీకాంత్ ఈ రహస్యం సినిమా ప్రమోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు. 

అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మంచి నిర్మాత. అయన మంచి ప్లానింగ్ తో సినిమాని విడుదల చేస్తారు. ఈ రహస్యం సినిమా ట్రైలర్ చూసాను చాలా బాగుంది, మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘మా దర్శకుడు సాగర్‌ శైలేష్‌ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ అయిన రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, మారుతీ మరియు రాజ్ కందుకూరిగారు ఈ సినిమా యొక్క ట్రైలర్లు విడుదల చేసారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరో శ్రీకాంత్ గారు మా సినిమా ప్రమోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు. వారికీ నా కృతఙ్ఞతలు. సినిమా చాల బాగా వచ్చింది, జనవరిలో విడుదల చేస్తాం..’’ అని తెలిపారు. 

ఈ సినిమాలో శైలేశ్‌, రితిక జంటగా నటించారు. సాగర శైలేశ్‌ దర్శకుడు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మాత.



By December 31, 2018 at 04:11AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44089/srikanth.html

No comments