Breaking News

4 సినిమాలు.. టాక్ బాగుంటే పండగే..?


ఈ భారీ వీకెండ్ కోసం... తెలుగు నుండి రెండు సినిమాలు, పరభాష నుండి రెండు సినిమాలు లైన్లోకొచ్చేశాయి. ఈ శుక్రవారం తెలుగులో ‘పడి పడి లేచె మనసు, అంతరిక్షం’ సినిమాలు విడుదలవుతుంటే, తమిళం నుండి ధనుష్ - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘మారి 2’ సినిమా, కన్నడ నుండి ‘కెజియఫ్’ సినిమాలు తెలుగులో విడుదల కాబోతున్నాయి. తెలుగులో ‘పడి పడి లేచె మనసు’లో శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమా క్యూటెస్ట్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇప్పటికే ట్రైలర్‌తో బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాకి బావుంది అనే టాక్ వస్తే చాలు... ప్రేక్షకులు క్యూ కడతారు. 

ఇక వరుణ్ తేజ్ - అదితి రావు - లావణ్య త్రిపాఠిల అంతరిక్షం చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ఇక కన్నడ క్రేజీ హీరో యష్ నటించిన కెజియఫ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ధనుష్ - సాయి పల్లవిల ‘మారి 2’  మీద తమిళంలో భారీ అంచనాలుంటే.. తెలుగులో సాయి పల్లవి హీరోయిన్ కాబట్టి ఈ సినిమా  మీద ఆటోమాటిక్‌గా తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారు. మరి ఈ లాంగ్ వీకెండ్ విన్నర్ ఎవరో కానీ.. ఏ సినిమాకి టాక్ బాగున్నా.. కలెక్షన్స్ కుమ్మేస్తాయి.  ఎందుకంటే గత మూడునాలుగు వారాలుగా ప్రేక్షకులను బోర్ కొట్టించే చిత్రాలే థియేటర్స్‌లో ఉన్నాయి కానీ.. ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే చిత్రమేది థియేటర్‌లో లేదు.

2.ఓ సినిమాని ప్రేక్షకులు గ్రాఫిక్స్ కోసమే భరించారు కానీ.. అసలా సినిమాలో విషయం లేకపోవడంతో.. ప్రేక్షకులు ఫీల్ గుడ్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాల్లో ఏ సినిమా టాక్ బావున్నా లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ దిమ్మతిరిగిపోతాయి. ఎందుకంటే శని ఆదివారాలే కాకుండా పిల్లలకి సోమవారం, మంగళవారం, బుధవారం కూడా స్కూల్స్‌కి హాలీడేస్. ఎందుకంటే సోమవారం క్రిస్టమస్ ఈవెంట్, మంగళవారం క్రిస్టమస్, బుధవారం బాక్సింగ్‌డే‌తో పిల్లల స్కూల్స్‌కి సెలవలు. అందుకే ఏ సినిమా టాక్ లేచినా... అది ఈ లాంగ్ వీకెండ్ అండ్ వీక్ డేస్‌లో వరమే అవుతుంది. చూద్దాం క్రిస్టమస్ హాలీడేస్ హీరో ఎవరనేది..? 



By December 20, 2018 at 01:44PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43938/maari-2.html

No comments