RRR.. టైటిల్ ఇది కాదంటూ మళ్లీ చర్చలు..!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR చిత్రం రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈరోజు (19) నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఈసినిమాపై రోజుకో వార్త బయటికి వచ్చి హల్ చల్ చేస్తుంది. ఈసినిమా స్టోరీ ఏంటి..ఎటువంటి జోనర్..ఇందులో ఎవరుఎవరు ఉన్నారు..హీరోయిన్స్ ఎవరు అన్న విషయాలపై ప్రేక్షకులతో పాటు సినీ జనాల్లో కూడా క్యూరియాసిటీ ఎక్కువ అయింది.
అయితే కొన్ని రోజులు నుండి ఈసినిమా టైటిల్ పై చర్చ జరుగుతుంది. #RRR అంటే ‘రామ రావణ రాజ్యం’ అనే స్పెక్యులేషన్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే జక్కన్న అండ్ టీం మాత్రం ఇంకా టైటిల్ గురించి ఏమి అనుకోలేదట. టైటిల్ గురించి రాజమౌళి తన ఫ్యామిలీ మెంబర్స్ తో చర్చలు జరుపుతున్నారని టాక్. ఇది మల్టీలాంగ్వేజ్ సినిమా కాబట్టి అన్ని భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుందని జక్కన్న ఆలోచనట.
‘బాహుబలి’ వలే ప్యాన్ ఇండియా అప్పీల్ ఉంటూ అదే సమయంలో పవర్ఫుల్‌గా కూడా టైటిల్ ఉండాలని రాజమౌళి భావిస్తున్నాడట. నవంబర్ 19 నుండి జరుగుతున్న ఈ షెడ్యూల్ దాదాపు 45 రోజులు పాటు జరగనుంది. ఈ షెడ్యూల్ తరువాత టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. జక్కన్న తన సినిమాల టైటిల్ విషయంలో ఏది త్వరగా ఫైనల్ చేయడు. సో ఇది కూడా అంతే.
By November 20, 2018 at 01:36AM
No comments