యాక్షన్ అనగానే RRRపై వార్తలే వార్తలు..!!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహా మల్టీస్టారర్ పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేసే చిత్రంపై మొదట్లో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. ఒకే ఒక్క ట్వీట్‌తో తర్వాత చేయబోయే సినిమాపై సంచలనాన్ని రేకెత్తించాడు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ అంటూ మూడు ఆర్‌లకు ముచ్చటైన్ పేర్లతో బయటికి వచ్చిన ఈ మూవీ గురించి.. ఎటువంటి చిన్న విషయం అయినా సంచలనం అవుతుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇది మెగా, నందమూరి అభిమానుల అనుబంధానికి సంబంధించిన విషయం కావడమే.. దీనికి ఉన్న ప్రధానాంశం.
ప్రకటన అయితే చేశారు కానీ.. నిజంగా ఇది తెరకెక్కుతుందా? అనుమానాలు మొన్నటి వరకు కూడా ఉండేవి. అటువంటి అనుమానాలకు తెరదించుతూ.. అట్టహాసంగా అతిరథ మహారధుల మధ్య ఈ చిత్రాన్ని ప్రారంభించేశారు. అంతేకాదు.. రెగ్యులర్ షూటింగ్ కూడా ఇదే నెలలో ప్రారంభించబోతున్నారు. ఈ షూట్‌లో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపైనే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండటంతో.. ఇప్పుడు ఇది ఏ తరహా చిత్రమో అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
నవంబర్ 19 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్టు నిర్మించారు. తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్, చరణ్‌లపై యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు రాజమౌళి అన్నీ సిద్ధం చేసి పెట్టేశాడు. అయితే తాజాగా ఈ సినిమాపై మరిన్ని వార్తలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో రామ్ చరణ్ లుక్ నార్మల్‌గానే ఉంటుందట కానీ ఎన్టీఆర్ మాత్రం కండలు తిరిగే దేహంతో.. ఇప్పటి వరకు కనిపించని లుక్‌లో కనిపిస్తారట. అంతేకాదు ఈ చిత్రంలో చరణ్-ఎన్టీఆర్‌లు.. హీరో, విలన్‌గా దర్శనమిస్తారని కూడా టాక్స్ నడుస్తున్నాయి. మరి ఇటువంటి అంచనాలున్న చిత్రాన్ని రాజమౌళి ఎలా తెరకెక్కిస్తాడో తెలియాలంటే గట్టిగా ఒక సంవత్సరం ఆగాల్సిందే.
By November 13, 2018 at 10:28AM
No comments