Breaking News

నాకేం కాలేదు..: రాజశేఖర్!


ఎన్నో ఏళ్ల నుంచి సరైన హిట్‌ లేక బాధపడుతోన్న ఒకప్పటి యాంగ్రీ యంగ్‌మేన్‌ రాజశేఖర్‌ ప్రవీణ్‌సత్తార్‌ తీసిన హైటెక్నికల్‌, భారీ చిత్రం ‘పీఎస్వీగరుడ వేగ’తో మరలా ట్రాక్‌పైకి వచ్చాడు. రాజశేఖర్‌ మార్కెట్‌ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పెట్టి ఈ చిత్రం తీయడం వల్ల మంచి టాక్‌, రాజశేఖర్‌ కష్టానికి మంచి పేరు వచ్చినా ఇది నిర్మాతలకు లాభాలను అందించలేకపోయింది. ఈ వయసులో కూడా రాజశేఖర్‌ చూపిన కమిట్‌మెంట్‌కి మంచి మార్కులే పడ్డాయి. దాంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఆయన తన తదుపరి చిత్రం కోసం కొంత గ్యాప్‌ తీసుకుని ప్రస్తుతం ‘కల్కి’ అనే చిత్రం చేస్తున్నాడు. నాని మెచ్చి మరీ నిర్మాతగా మారిన ‘అ!’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ద్వితీయ చిత్రంగా ఇది రూపొందుతోంది. 
ఈ చిత్రం షూటింగ్‌లో రాజశేఖర్‌ రిస్కీ ఫైట్‌ చేస్తూ 10రోజుల కిందట గాయపడ్డాడట. ఓ యాక్షన్‌సీన్‌ సందర్భంగా తాను గాయపడ్డానని అయినా రెస్ట్‌ తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నానని ఆయన తెలిపాడు. ఈ సీక్వెన్స్‌లో చిత్రంలోని పలువురు ముఖ్యనటులు పాల్గొంటున్నారని, వారి డేట్స్‌కి ఇబ్బంది కలగకుండా తాను విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నానని ఆయన తెలిపాడు. గతంలో రాజశేఖర్‌ సినిమాల షూటింగ్‌ల సమయంలో పలు విధాలుగా టైంకి రాకుండా ఇబ్బంది పెట్టాడనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన వాలకం చూస్తుంటే బాగా మారిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రం కోసం ఆయన కులుమనాలి వెళ్లాడు. 
అనుకోకుండా కొండచరియలు విరిగిపడటంతో తమ ప్రయాణం కాస్త ఆలస్యమైందని, ఈ ప్రమాదంలో ఎటువంటి ఇబ్బందులు ఎవ్వరికీ కలుగలేదని, అందరం క్షేమంగా ఉన్నామని ఆయన తెలిపాడు. మా ప్రయాణం మరలా ప్రారంభమైంది.. అందమైన కులుమనాలిలో షూటింగ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. స్నేహితులు, అభిమానుల నుంచి మేము క్షేమంగా ఉన్నామా? అని విపరీతంగా కాల్స్‌ వస్తున్నాయి. అందరి ప్రేమకు కృతజ్ఞతలు అని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. మరి ఈ చిత్రం విజయం సాధించడంతో పాటు కమర్షియల్‌గా కూడా లాభసాటి ప్రాజెక్ట్‌ అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది..! 


By November 24, 2018 at 02:51PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43632/hero-rajasekhar.html

No comments