Breaking News

మంచు మనోజ్ గోల్.. ఇదేనంట..!!


తెలుగులోని యంగ్‌ హీరోలలో కోలీవుడ్‌లోని ధనుష్‌, శింబులాగా బహుముఖప్రజ్ఞాశాలిగా, మంచి అభిరుచి ఉన్న నటునిగా, మంచు మోహన్‌బాబు వారసునిగా మంచు మనోజ్‌కి మంచి గుర్తింపే ఉంది. ఆయన పలు కీలక సమయాలలో కూడా బాగా స్పందిస్తూ ఉంటాడు. ఆమధ్య తిత్లీ తుపాన్‌కి రామ్‌చరణ్‌ వంటి వారు సాయం చేసినప్పుడు వారిని బహిరంగంగా ఎంతో మెచ్చుకున్నాడు. నటునిగా, డ్యాన్స్‌, ఫైట్స్‌, గాయకునిగా పలు కోణాలు ఈయనలో ఉన్నాయి. కానీ ఈయన దురదృష్టం ఏమిటంటే.. ఇన్ని టాలెంట్స్‌ ఉండి కూడా దేనిమీదా పూర్తిగా శ్రద్దపెట్టడనే అపవాదు ఉంది. మరోవైపు మంచు లక్ష్మీప్రసన్న, మంచు విష్ణులు కూడా సమాజానికి ఏదో చేయాలనే తపన ఉన్న వారే. 

కాగా మంచు మనోజ్‌ ఒకానొకసారి తాను నటనకు గుడ్‌బై చెబుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత మరలా అలాంటిదేమీ లేదన్నాడు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, నాటి స్వర్గీయ ఎన్టీఆర్‌ నుంచి మంచు ఫ్యామిలీకి అందరితోనూ సాన్నిహిత్యం, బంధుత్వం కూడా ఉన్నాయి. ఇక గత కొంత కాలం కిందట మోహన్‌బాబుని జగన్‌ కలిసిన సందర్భంగా ఆయన వైసీపీలో చేరబోతున్నాడని వార్తలు వచ్చాయి. మోహన్‌బాబు కూడా తనకు గానీ లేదా తన వారసులకుగానీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సీటు అడిగినట్లు కూడా మీడియా కోడై కూసింది. ఇక ఇటీవల మంచు మనోజ్‌ తనకు రాజకీయాలలోకి రావాలని ఉందని, తిరుపతి కేంద్రంగా రాయలసీమ అంతటికీ సేవా కార్యక్రమాలు విస్తరిస్తానని చెప్పాడు. 

తాజాగా ఓ అభిమాని మంచు మనోజ్‌ని.. ఇంతకీ నీ గోల్‌ ఏంటి? నీ ప్లానేంటి? నీ స్కీం ఏంటి? అనే ప్రశ్న వేశాడు. దానికి మంచు మనోజ్‌ ఓ ఖాళీగా ఉన్న స్థలం వద్ద తాను దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసి, పేద విద్యార్ధుల కోసం, రైతుల కోసం ఏదైనా చేయాలనే నా కల ఈ ఖాళీ ప్రదేశం ద్వారా తీరబోతోంది. నేనున్న చోట ఉచిత విద్య, ఉచిత ఆహారం, క్రీడాసౌకర్యాలు, మంచి నీటి వసతి ఉండాలనేదే నా కోరిక అని తెలిపాడు. దీంతో మంచు మనోజ్‌ వైసీపీ పార్టీ ద్వారా పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. 



By November 07, 2018 at 04:58AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43380/manchu-manoj.html

No comments