‘అంజలి విక్రమాదిత్య’గా నయన్ సినిమా!


తెలుగులో 'అంజలి విక్రమాదిత్య' గా రానున్న నయనతార తమిళ సూపర్ హిట్ చిత్రం 'ఇమైక్కా నొడిగళ్'..!!

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'ఇమైక్కా నొడిగళ్' తెలుగులో భాషలోకి  అనువాదం అవుతుంది.. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ లు ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చి విజయవంతం అయిన ఈ చిత్రానికి తెలుగులో 'అంజలి విక్రమాదిత్య'  టైటిల్ ని ఖరారు చేసారు.. ఆర్. అజయ్ గనన్ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, అధర్వ, రాశిఖన్నా లు ప్రధానపాత్రలు పోస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకునిగా కనిపించనున్నారు.. ఈ సినిమాలో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిధిపాత్రలో మెరవనున్నారు..  తమిళంలో క్యామియో ఫిలిమ్స్ బ్యానర్ పతాకంపై సీజే జయకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా, హిప్ హాఫ్ తమిళ సంగీతం, RD రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందించారు. డబ్బింగ్ కార్యక్రమాలు ఎంతో చురుకుగా సాగుతుండగా ఈ చిత్రాన్ని జనవరి లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

తారాగణం: నయనతార, అధర్వ, రాశి ఖన్నా, అనురాగ్ కశ్యప్, రమేష్ తిలక్, దేవన్ మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు : కథ, స్క్రీన్ ప్లే & డైరెక్షన్: ఆర్. అజయ్ గనన్ముత్తు, నిర్మాతలు: సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్, బ్యానర్: విశ్వశాంతి క్రియేషన్స్, సంగీతం:హిప్ హాఫ్ తమిళ, సినిమాటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్, ఎడిటర్: భువన్ శ్రీనివాసన్, PRO: వంశీ-శేఖర్



By November 20, 2018 at 11:24AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43567/nayanthara.html

No comments