హీరోయిన్‌ని మర్చిపోయావేంది.. బోయపాటి..??
బోయపాటి - రామ్ చరణ్ కలయికలో మొదటిసారిగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో మెగా అభిమానులకు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు ఇచ్చేసాడు చరణ్. ఫస్ట్ లుక్ లో మాస్ హీరోగా కనబడిన రామ్ చరణ్ టీజర్ లోను బోయపాటి సినిమాలను తలదన్నే రీతిలో మాస్ లుక్ లోనే కనబడ్డాడు. అయితే మెగా అభిమానులకు రామ్ చరణ్ అలా మాస్ లుక్‌లో కనబడడం అనేది పండగలాంటిదే అయినా.. చాలా మంది రామ్ చరణ్ లుక్‌పై రొటీన్ అనే అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం విశేషం. ఎందుకంటే బోయపాటి సినిమాల్లో హీరోలు మొత్తంగా మాస్ తరహాలోనే కనబడతారు.
ఇక అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో మాస్ యాక్షన్ కాస్త ఎక్కువగానే కనబడింది. మరి ఫస్ట్ లుక్ లోను చరణ్ నే దింపి, టీజర్ మొత్తం రామ్ చరణ్ యాక్షన్ నే కట్ చేసిన బోయపాటి.. హీరోయిన్ ని ఎక్కడా పరిచయం చేయలేదు. రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రంలో ఇంతవరకు హీరోయిన్ లుక్ మాత్రం బయటికి రాలేదు. భరత్ అనే నేనులో మహేష్ సరసన వసుమతిగా సాదా సీదా పాత్రలో కనబడిన కియారా.. రామ్ చరణ్ సినిమాలో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంది. మరి లుక్ లోను, టైటిల్ లోను, టీజర్ లోను హీరోయిన్ కి బోయపాటి చోటు లేకుండా చేశాడు.
మరి మళ్ళీ ఏ స్పెషల్ అకేషన్‌కి కియారా అద్వానీ లుక్ వదులుతాడా అనే ఆసక్తితో జనాలు ఉన్నారు. చూద్దాం... హీరో రామ్ చరణ్ ని స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపెట్టిన బోయపాటి హీరోయిన్ కియారాని ఎలా చూపించబోతున్నాడో అనేది. మరి బోయపాటి సీనియాల్లో హీరోయిన్ కి హీరోలతో సమానంగా కాకపోయినా మంచి ప్రాధాన్యతే ఉంటుంది. చాలా భారీ బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్ అలా వచ్చి వెళ్లిపోయే పాత్రలుగా కాకుండా హీరోయిన్ పాత్రలను బోయపాటి బాగానే చూపిస్తాడు. చూద్దాం ‘వినయ విధేయ రామ’లో కియారా లుక్ అండ్ స్టయిల్ ఎలా ఉండబోతుందో అనేది.
By November 11, 2018 at 06:24AM
No comments