Breaking News

నా చిన్నతనం నుంచి ఆ పని చేస్తున్నా: అక్షయ్


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘2.0’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ చిత్రానికి సీక్వెల్‌గా ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, కరణ్‌ జోహర్‌ సమర్పణలో సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా త్రిడి ఫార్మాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్‌లో సౌండ్‌ డిజైన్‌ చేయడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్‌ 3న చెన్నైలో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘2, 3 గంటలు ప్రాక్టీస్‌ చేసి తమిళ్‌లో రాసుకుని మాట్లాడుతున్నా. ఆనందంగా ఉంది. రజనీసార్‌, శంకర్‌సార్‌, రెహమాన్‌గారితో కలిసి ‘2.O’లో నా పేరు కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం నన్ను అప్రోచ్‌ అయిన టీమ్‌కి ధన్యవాదాలు.. అని అన్నారు. అనంతరం విశాల్‌ అడిగిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నకు అక్షయ్‌ సమాధానమిస్తూ.. ‘‘నాకు నా జిమ్‌ ఉంది. నేను ప్రతి రోజూ ఉదయం 4 గంటలకు లేస్తా. మా నాన్న ఆర్మీలో ఉండేవారు. నా చిన్నతనం నుంచి చేస్తున్నా. నా లైఫ్‌ స్టైల్‌ నాకు ఇష్టం. ఎవరూ నన్ను ఇలాగే చేయమని ఫోర్స్‌ చేయలేదు. నా జీవితంలో ప్రతి రోజూ నేను సన్‌రైజ్‌ని చూస్తాను. నేను ప్రతి రోజునూ, ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తాను. నాకు నా శరీరమే దేవాలయం. మా నాన్న నాకు అదే నేర్పించారు. నాకు విశాల్‌ గురించి తెలుసు. తను అన్నం తినడని నాకు తెలుసు. వాళ్ల అమ్మకు అది నచ్చదని కూడా నేను చదివా. కనీసం ఆదివారమైనా అన్నం, దోసలు, ఇడ్లీలు తినాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు. కృతిక అనే ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా. శంకర్‌ నా దృష్టిలో సైంటిస్ట్‌. ఆయన డైరక్టర్‌ మాత్రమే కాదు, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. మూడున్నర గంటలు కూర్చుని మేకప్‌ చేసుకోవడం, ఏడాదిన్నర దాన్ని తీసుకోవడం నేను మర్చిపోలేను. నేను గత 28 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇన్నేళ్లుగా వేసుకున్న మేకప్‌ మొత్తం ఈ సినిమాకు వేసుకున్న మేకప్‌తో సరితూగదు. ఈ సినిమా నాకు ఇచ్చినందుకు శంకర్‌గారికి ధన్యవాదాలు’’ అని అన్నారు. 



By November 05, 2018 at 08:00AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43349/akshay-kumar.html

No comments