Breaking News

అక్క సుహాసిని కోసం ఎన్టీఆర్ దిగుతున్నాడు


‘అక్క సుహాసిని విజయం కోసం హీరో తారకరత్న ప్రచారం’

తెలంగాణ రాజకీయాల్లో నందమూరి వంశం మరోసారి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. టీడీపీకి కంచుకోటగా ఉండే రాజధాని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో జెండాను రెపరెపలాడించేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో పార్టీకి విశేష సేవలు అందించి అశువులు బాసిన దివంగత నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణకు రాజకీయ వారసురాలిగా సుహాసినిని కూకట్‌పల్లి బరిలోకి దించింది. నందమూరి హరికృష్ణ కూతురిగా రాజకీయాల్లోకి ప్రవేశించగానే టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. నందమూరి బిడ్డను హృదయాలకు హత్తుకొని ఆమె గెలుపుకు ఉరకలేస్తున్నారు. కార్యకర్తలు కూకట్‌పల్లిలో టీడీపీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. 

ఇక తమ రాజకీయ వారసురాలిని గెలిపించుకోవడానికి నందమూరి హీరోలు ఒక్కొక్కరుగా రంగంలోకి దూకుతున్నారు. సుహాసిని అక్క గెలుపు కోసం హీరో నందమూరి తారకరత్న(యన్.టి.ఆర్) సిద్ధమయ్యాడు. అక్క విజయం కోసం కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్టీ ప్రచారానికి బయలుదేరుతున్నారు. 

అక్క సుహాసిని తరుఫున నందమూరి తారకరత్న ప్రచారం చేయనున్నట్టు పార్టీ, కుటుంబ వర్గాలు వెల్లడించాయి. కార్యకర్తలతోపాటు తారకరత్న ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీ కోసం కృష్టి చేస్తాయని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ.. అక్క గెలుపు కోసం కృషి చేస్తాను. అక్క గెలుపే పెదనాన్న హరికృష్ణకు ఘన నివాళి. రాజకీయాల్లో పెదనాన్న లేని లోటును అక్క విజయంతో పూడ్చుతాం.. అని అన్నారు.



By November 25, 2018 at 11:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43648/tarkaratna.html

No comments