Breaking News

దేవుడే నా కోసం ఆయన్ను పుట్టించాడంటోంది!


ప్రస్తుతం దేశవిదేశాలలో అందరి దృష్టి ఇటీవల పెళ్లయిన ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్కశర్మల మీదనే ఉంది. కాగా గతంలో చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడిన తర్వాత, వివాహం చేసుకున్నాక, ఆటపై సరైన శ్రద్ద చూపక కనుమరుగయ్యారు. కానీ విరాట్‌ కోహ్లి దీనికి పూర్తి విరుద్దంగా పెళ్లయిన తర్వాత వరుస పెట్టి రికార్డులను కొల్లగొడుతున్నాడు. తాజాగా విండీస్‌ జట్టుపై వరుసగా మూడు వన్డేలలో మూడు సెంచరీలు చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. సచిన్‌ తర్వాత అత్యంత వేగంగా 10వేల రన్స్‌ని దాటిన ఆటగాడిగా అత్యధిక సెంచరీలతో సంచలనాలు సృష్టిస్తూ నయా క్రికెట్‌ దేవుడుగా, రన్స్‌ మెషీన్‌గా ఖ్యాతిని తెచ్చుకుంటున్నాడు. 

మరోవైపు ఆయనకు విండీస్‌తో జరిగే టి-20ల నుంచి మాత్రం సెలక్షన్‌ కమిటీ విశ్రాంతిని ఇచ్చింది. ఇదే సమయంలో విరాట్‌ కోహ్లి తన 30వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి అనుష్క శర్మ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయనతో తాను కలిసి తీయించుకున్న ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. బర్త్‌డే సందర్భంగా ఈ జంట విహారయాత్రకు కూడా వెళ్లారు. గతంలో విరాట్‌, అనుష్క బర్త్‌డే వచ్చిన ప్రతిసారి వివిధ రకాల కేక్స్‌ని తెప్పించి మరీ ఆ వేడుకలను ఆమెకి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా చేశాడు. ఇప్పుడు అనుష్క కూడా విరాట్‌ కోసం ఓ సర్‌ప్రైజ్‌ పార్టీని ప్లాన్‌ చేసిందట. 

మరోపక్క అనుష్క ప్రస్తుతం ‘జీరో’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో అనుష్కకి జోడీగా షారుఖ్‌ఖాన్‌ నటించాడు. ఆనంద్‌. ఎల్‌.రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ కూడా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. డిసెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విరాట్‌ బర్త్‌డే సందర్భంగా అనుష్క ట్వీట్‌ చేస్తూ, అతన్ని నాకోసం పుట్టించినందుకు ధన్యవాదాలు దేవుడా? అనే ట్వీట్‌కి నెటిజన్ల నుంచి బాగా స్పందన వస్తోంది. 



By November 06, 2018 at 12:28PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43370/anushka-sharma.html

No comments