‘యన్.టి.ఆర్’లో అర్జునుడు, కర్ణుడుగా వీరే..!!
‘యన్.టి.ఆర్’ ఈ పేరు వినబడితే చాలు.. వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. తెలుగుతనం ఉట్టిపడుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక శకాన్ని పూరించిన యన్.టి.ఆర్... రాజకీయంగానూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన లేకపోయినా.. ఆయనకున్న కీర్తి మాత్రం సినిమా ఉన్నంతకాలం నిలిచే ఉంటుంది. ఇక ‘యన్.టి.ఆర్’ని ఇప్పటి తరానికి కూడా పరిచయం చేయాలని కంకణం కట్టుకుని మరీ బరిలోకి దిగిన నందమూరి నటసింహం.. ఎంతో బాధ్యతగా ఆయన బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. ‘యన్.టి.ఆర్’ అనే టైటిల్‌తో కథానాయకుడు, మహానాయకుడు అంటూ ఆయనలోని రెండు కోణాలను తెలియజెప్పడానికి శరవేగంగా చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నాడు బాలయ్య. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఎటువంటి అప్‌డేట్ వచ్చినా.. సంచలనంగా మారుతుండటం విశేషం.
ఇక తాజాగా ‘యన్.టి.ఆర్’ అప్‌డేట్ ఏమిటంటే పెద్దాయన నటించిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇందులోని ‘చిత్రం భళారే విచిత్రం’ అనే సాంగ్‌ని తాజాగా షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు ‘దానవీరశూరకర్ణ’లో ఎన్టీఆర్ నటించిన పాత్రలన్నీ బాలయ్య వేస్తుండగా.. మహానాయకుడులో రథసారధిగా నటిస్తున్న కళ్యాణ్‌రామ్.. ఈ కథానాయకుడులో అందునా.. ‘దానవీరశూరకర్ణ’ పాత్రలలో అర్జునుడి పాత్రను పోషిస్తున్నారట. వాస్తవానికి అసలు ‘దానవీరశూరకర్ణ’లో అర్జునుడుగా హరికృష్ణే నటించారు.
వీరిద్దరి కాంబినేషన్‌లో అంటే బాలయ్య (కర్ణుడు)- కళ్యాణ్‌రామ్(అర్జునుడు) కాంబోలో వచ్చే సీన్లను చిత్రీకరణ జరుపనున్నారట. దీనికి సంబంధించి ఓ సెట్‌ను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లుగా సమాచారం. ఇలా ప్రతీది ఎంతో ఆసక్తికరంగా ‘యన్.టి.ఆర్’ గురించి వినిపిస్తున్న తరుణంలో.. ఈ కాంబోలో వచ్చే సన్నివేశాలు మహారంజుగా కనువిందు చేయనున్నాయని చిత్రయూనిట్ కూడా అంటోంది.
By November 14, 2018 at 11:18AM
No comments