Breaking News

రాజమౌళి ఏం చెబితే అదే ఫైనల్..!!


ఇప్పుడు స్టార్ హీరోలంతా రాజమౌళితో సినిమా చేస్తే చాలు కెరీర్ లో అంతా సెట్ అవడమే కాదు.... తమ మార్కెట్ కూడా పదింతలు పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు. మరి సాదా సీదా స్టార్ హీరో రేంజ్ అయిన ప్రభాస్ ని బాహుబలితో ప్రపంచానికి పరిచయం చేశాడు. బాహుబలిని చూసి బాలీవుడ్ కూడా ఒణికిపోయిందంటే రాజమౌళి దర్శకత్వంలో దమ్మెంతుందో అర్ధమవుతుంది. అందుకే రాజమౌళితో సినిమాలు చేసేందుకు కేవలం హీరోలు మాత్రమే కాదు... నిర్మాతలు కాచుకుని కూర్చున్నారు. కానీ ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ డివివి దానయ్య, రాజమౌళి బడా సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే రాజమౌళి బాహుబలితో భారీగా విరామం తీసుకుని. చడీ చప్పుడు లేకుండా ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో సినిమా ప్రకటించేసి అందరికి షాక్ ఇచ్చాడు.

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లైతే రాజమౌళి సినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అలా వారికి ఆ జాక్ పాట్ తగలడంతో.. రాజమౌళితో కథ కూడా చెప్పించుకోవక్కర్లేదనుకున్నట్లుగా వుంది వారి వ్యవహారం. అందుకే ఎక్కడ కనబడినా రాజమౌళి తమకింక కథ చెప్పలేదని చెబుతున్నారు. ఇలా రాజమౌళి హీరోలను లాక్ చేసి మరీ సినిమాని ఆరమ్స్ గా మొదలెడుతున్నాడు. ఇక నిర్మాతకైతే డబ్బులిస్తే చాలు.. రాజమౌళి ఏం చేసినా ఇబ్బంది లేదు. మరి రాజమౌళి మీద నమ్మకం ఏ రేంజ్ లో ఉందో దీన్నిబట్టే అర్ధమవుతుంది. దానయ్య, రాజమౌళి ఏం చేసినా అభ్యంతరం లేదు. ఇక హీరోలు కూడా అదే పంథాలో ఉన్నారు..

రాజమౌళితో సినిమా చేస్తే చాలు తమకి ఎదురులేదనుకుంటున్నారు. అందుకే పారితోషకం పక్కనపెట్టి మరీ లాభాల్లో వాటా తీసుకుంటున్నారు వారు. ఇక రాజమౌళి ఎప్పటిలాగే ఈ ప్రాజెక్ట్ కి అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. మరి రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో హీరోలు, నిర్మాత కూడా పూర్తి బాధ్యతను రాజమౌళి మీదే పెట్టారు. మరి బాధ్యతంతా నెత్తినేసుకుని రాజమౌళి తన ఫ్యామిలీతో రేపు నవంబర్ 11 న 11 గంటలకు రంగంలోకి దిగి ఈ RRR ప్రాజెక్ట్ ని సక్సెస్ ఫుల్ గా రెండేళ్లపాటు కంప్లీట్ చేసి ప్రేక్షకుల మీదకి వదులుతాడు. కానీ ఈ రెండేళ్లు మాత్రం ప్రేక్షకుల ఉత్కంఠ మాములుగా ఉండదు మరి.



By November 11, 2018 at 09:57AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43444/rajamouli.html

No comments