Breaking News

హీరోయిన్‌తో లిప్‌లాక్.. హీరో భార్య అలక..!!


కొన్నికొన్ని సార్లు హీరోలు.. హీరోయిన్స్ తెరపై చేసే సన్నివేశాలు రియల్ లైఫ్ లో కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్...బెడ్ రూమ్ సీన్స్. సరిగా అటువంటి సీన్స్ చేసేటప్పుడే బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు అలాంటి సమస్య ఒకటి ఎదురైంది. బాలీవుడ్ లో ‘వికీ డోనర్’ సినిమాతో సినీ లవర్స్ కి దగ్గరైన ఆయుష్మాన్ ఖురానా సరసన యామీ‌గౌతమీ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో ఓ సీన్‌లో ఆమెతో లిప్‌లాక్ చేశాడు. సినిమాలో ఆ సీన్ అద్భుతంగా వచ్చింది కానీ ఆ సన్నివేశాన్ని చూసిన హీరో వైఫ్ తహీరా కశ్యప్ అప్‌సెట్ కావడమే కాదు.. తనను వదిలేసి వెళ్లిపోయిందని ఓ షోలో వెల్లడించాడు నటుడు ఆయుష్మాన్ ఖురానా. యామితో లిప్ లాక్ సీన్ వల్ల తాను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపాడు.

మా వైఫ్ ని కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టిందని చెప్పాడు. ప్రస్తుతం మా వైఫ్ లిప్ లాక్ సీన్స్ కు అభ్యంతరం తెలపట్లేదని అన్నాడు. ‘మన్మార్జియాన్’ షూటింగ్‌లో భూమి‌ పడ్నేకర్‌తో లిప్‌లాక్ సీన్‌ను మా వైఫ్ ప్రత్యక్షంగా చూసిందని చెప్పాడు.



By November 02, 2018 at 10:12AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43305/ayushmann-khurrana.html

No comments