‘పోకిరి’పై ఇలియానా ఇలా అనేసిందేంటి?
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమయంలో.. టాలీవుడ్‌పై హాట్ హాట్ కామెంట్స్ చేసి మరీ బాలీవుడ్ చెక్కేసిన ఇలియానా.. తిరిగి టాలీవుడ్‌కి తిరుగు టపా కట్టింది. అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో హడావుడి చేస్తుంది. ఇందులో భాగంగా ఇలియానా మీడియాతో ముచ్చటించింది.
అసలు ఎందుకు టాలీవుడ్ వదిలి వెళ్లాల్సి వచ్చింది అనే దాని గురించి ఇలియానా మాట్లాడుతూ.. ‘‘బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘జులాయి’ సినిమా చేసే టైమ్‌లో బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ స్టోరీ మొత్తం త్రివిక్రమ్ గారికి చెప్పగా.. స్టోరీ చాలా బాగుంది. చేయండి అంటూ ప్రోత్సాహించారు. అలా బాలీవుడ్ వెళ్లిన నాకు.. అక్కడ వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. దీంతో మళ్లీ ఇటువైపు చూసే అవకాశం రాలేదు. మధ్యలో రెండు మూడు ఆఫర్లు టాలీవుడ్ నుంచి వచ్చాయి కానీ.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకున్నాను.
ఇక నాకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ఇచ్చింది పోకిరి సినిమానే. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా చేసేప్పుడు అయిష్టంగానే చేశాను. ఇంత పెద్ద హిట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. ఈ సినిమాలో నేను చేయడానికి కారణం మహేష్ సోదరి మంజులనే కారణం. ఆవిడే ఈ పాత్ర చేయమని ఒప్పించారు. ఆవిడ కోసమే ‘పోకిరి’లో చేశా. పెద్ద హిట్ అయింది. అలాగే నేను ఎంతో ఇష్టపడి చేసిన కొన్ని సినిమాలు సరిగా ఆడక తీవ్ర నిరాశను మిగిల్చాయి. అయితే సినిమా హిట్టయినా, ప్లాప్ అయినా.. ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను..’’ అని ఇలియానా పోకిరి గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.
By November 13, 2018 at 09:41AM
No comments