Breaking News

గ్రేట్ పిక్: ఒకవైపు మెగాస్టార్.. మరోవైపు టైగర్


నిజంగా ఈ ఫొటోలా జరిగి ఉంటే ఎంత బాగుండేది. అటువైపు మెగాస్టార్, ఇటువైపు నందమూరి టైగర్ వారి వారి పుత్రరత్నాల కోసం క్లాప్ కొడితే నిజంగా మెగా, నందమూరి అభిమానులకు వచ్చే కిక్కే వేరప్పా.. అనేలా ఉండేది. కానీ ఆ అవకాశం లేకుండా దేవుడు హరికృష్ణని దూరం చేశాడు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సావానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రాజమౌళి బాహుబలి ప్రభాస్ కూడా హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఇటీవల యాక్సిడెంట్‌లో తన తండ్రిని కోల్పోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం.. ఈ వేడుకలో అంత ఉత్సాహంగా ఏమీ కనిపించలేదు. ఇంకా తండ్రి మరణవార్తను జీర్ణించుకోలేదన్నట్లుగానే ఆయన ఈ వేడుకలో మెలిగారు. ఈ వేడుకలో కల్యాణ్ రామ్ పాల్గొన్నప్పటికీ టైగర్ హరికృష్ణ కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది అనేది అతిథులైన అందరూ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ లోటును పూడ్చాలని ఓ నందమూరి అభిమాని భావించాడు. ఒకవైపు టైగర్ హరికృష్ణ, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కలిసి క్లాప్ కొడుకున్న ఫొటోను సృష్టించి నెట్ మాయాజాలంలో వదిలాడు. అది ఎంతగా పాపులర్ అయిందంటే కాసేపు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిదంటే నమ్మాలి.

ఇక ఈ ఫొటోను తన ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేసిన మంచు మనోజ్.. ‘‘చూసేందుకు ఈ ఫొటో అద్భుతంగా ఉంది. సూపర్ టీమ్ ‘ఆర్ఆర్ఆర్’కు నా బెస్ట్ విశెష్. ఈ ‘ఆర్ఆర్ఆర్’ను మేము సినిమాగా భావించడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఫెస్టివల్‌గా భావిస్తున్నాం. చిత్రటీమ్‌కు ఆ దేవుడు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపాడు.



By November 14, 2018 at 04:07AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43480/manchu-manoj.html

No comments