త్రివిక్రమ్, బన్నీ మూవీ ఆలస్యానికి కారణమిదే?
ఈమధ్యన త్రివిక్రమ్ సినిమాలన్నీ కాపీ కంటెంట్ అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరగడం కాదు చాలా సినిమాల విషయంలో ఆ ప్రచారం ప్రూవ్ కూడా అయ్యింది. అ ఆ సినిమా మీనా నవల నుండి కాపీ కొట్టి గమ్మునున్నాడు. కానీ మీడియా వదులుతుందా.. తర్వాత దిగొచ్చి ఒప్పుకున్నాడు. అలాగే అజ్ఞాతవాసి సినిమా విషయంలో త్రివిక్రమ్ పరువు మొత్తం పోయింది. అజ్ఞాతవాసికి కోట్లు వదిలించుకోవాల్సి వచ్చింది. ఇక అరవింద సమేత సినిమా కూడా కాపీనే అన్నారు కానీ.. ఎక్కడా ప్రూవ్ అయిన సందర్భాలు లేవు.
ఇక తాజాగా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సినిమా కూడా హిందీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కబోతుంది అంటున్నారు. అసలు త్రివిక్రమ్ కథ, మాటలంటే యువత మాత్రమే కాదు చిన్న పెద్ద ప్రేక్షకులు కూడా పడి చచ్చిపోతారు. త్రివిక్రమ్ మార్క్ కామెడీని అందరూ లైక్ చేస్తారు. మరి అంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఇలా వేరే సినిమాలను కాపీ చేస్తూ ఎందుకు సినిమాలు చేస్తున్నాడు.... అనేది అర్ధం కానీ ప్రశ్న. అసలు ఆయన మీద ఆయనకు నమ్మకం పోయిందా... అందుకే ఇలా చేస్తున్నాడా? అనే అనుమానాలు కలుగక మానవు.
అయితే తాజాగా ఈ కాపీ విషయంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్‌కి ఓ కండీషన్ పెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మొన్న దివాళి తర్వాత మొదలవుతుంది అన్నారు. కానీ అల్లు అర్జున్ దివాళి విశేష్ అయితే చెప్పాడు కానీ.. కొత్త సినిమా ప్రకటన ఇంకాస్త ఆలస్యమవుతుంది అని చెప్పాడు. అయితే త్రివిక్రమ్ ని అల్లు అర్జున్ ఒక కొత్త కథను తయారు చెయ్యమని.. ఏ సినిమాకి కాపీ వద్దని... సినిమా మొదలు పెట్టడం ఆలస్యమైనా పర్లేదు కానీ.. ఫ్రెష్ స్టొరీనే రెడీ చెయ్యమని చెప్పనట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబో మూవీ ఆలస్యమవడానికి అసలు కారణం ఇదేగా చెబుతున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా కథ సెట్ అయ్యేవరకు సినిమాని ప్రకటించకూడదనే ఉద్దేశ్యంతోనే ఉన్నాడట.
By November 16, 2018 at 07:40AM
No comments