Breaking News

శ్రీదేవి భర్తతో స్టార్ హీరో భేటీ.. అందుకేనా?


దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌తో ప్రముఖ నటుడు తలా అజిత్ భేటీ అయ్యారు. భోనీకపూర్ నిర్మాణంలో.. వినోద్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సదురంగవేట్టై’. ఈ సినిమాలో హీరోగా అజిత్ నటిస్తున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన వీరిద్దరి భేటీలో సినిమా షూటింగ్‌కు సంబంధించి సుమారు అరగంటపాటు చర్చ జరిగింది. హిందీలో బిగ్ బీ అమితాబ్ నటించిన ‘పింక్’ కథలో కాసిన్ని మార్పులు, చేర్పులు చేసి త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తోంది. కాగా ‘పింక్’  మూవీ సూపర్ డూపర్ హిట్టయింది.. అదే సినిమాను రీమేక్ చేస్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లకు కొదువవుండదని భావించి భోనీకపూర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది.

భేటీ అనంతరం దర్శకుడు వినోద్ మీడియాతో మాట్లాడుతూ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఇది ముమ్మాటికి పింక్ మూవీ రీమేక్‌ అని.. సినిమాకు సంబంధించిన వివరాలేమైనా ఉంటే అధికారికంగా చెబుతామన్నారు. తనకు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ లేదని.. దయచేసి పుకార్లు నమ్మొద్దని ఈ సందర్భంగా వినోద్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. అజిత్ నటించిన ‘విశ్వాసం’ మూవీ పొంగల్‌కు అభిమానుల ముందుకు రానుంది. ఈ గ్యాప్‌లో సమయం వృథా చేయడమెందుకనీ.. ఏరోనాటికల్ విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు అజిత్. కాగా.. సినిమా రిలీజ్ కోసం అజిత్ అభిమానులు వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. విశ్వాసం మూవీ రిలీజ్ టైమ్‌లోనే సూపర్‌స్టార్ రజినీ కాంత్‌ నటించిన ‘పెటా’ మూవీ రిలీజ్ కానుంది. అంతేకాకుండా సౌత్‌‌లో నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్, మెగా పవర్‌స్టార్ హీరోగా నటిస్తున్న ‘వినయ విధేయరామ’ మూవీలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. అయితే అభిమానులు, సౌత్ జనాలు ఎవరికి హిట్టిస్తారో వేచి చూడాల్సిందే.



By November 17, 2018 at 01:15PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43530/thala-ajith.html

No comments