Breaking News

గోవా బ్యూటీకి స్కోప్ లేదు.. మళ్లీ గోవాకే..!!


గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. అంతేకాదు మహేష్ బాబుతో కలిసి పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలోనూ నటించింది. యంగ్ అండ్ స్టార్ హీరోల తో నటించిన ఇలియానా టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్ తో జల్సా, అల్లు అర్జున్ తో జులాయి, ఎన్టీఆర్ తో రాఖి వంటి హిట్ చిత్రల్లో నటించిన ఇలియానాకి టాలీవుడ్ లో అందుతున్న నీరాజనాలు చాలక బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసింది. మరి ఏ సౌత్ హీరోయిన్ కైనా ఫైనల్ టార్గెట్ బాలీవుడ్ అన్నది తెలిసిందే కదా. అలా ఇలియానా కూడా బాలీవుడ్ ని ఒక ఊపు ఊపుదామనుకుంది. కానీ అక్కడ హిట్ సినిమాల్లో అయితే నటించింది కానీ దీపికా, కత్రినా, కరీనా, ప్రియాంక సరసన మాత్రం నిలవలేకపోయింది. ఇక బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూసి చూసి మొహం వాచిపోయిన ఇలియానాకి దర్శకుడు శ్రీను వైట్ల.. రవితేజ అమర్ అక్బర్ ఆంటొని సినిమాలో అవకాశం ఇచ్చాడు.

అసలు ముందుగా అమర్ అక్బర్ ఆంటొని‌లో అను ఇమ్మాన్యువల్ నటించాల్సి ఉంది. కానీ ఆమెకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్‌తో అను... అమర్ అక్బర్ ఆంటొని నుండి తప్పుకోవడంతో టాలీవుడ్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఇలియానాకి ఆ ఛాన్స్ తగిలింది. ఇక అమర్ అక్బర్ ఆంటొని తో ఇలియానా మళ్ళీ టాప్ పొజిషన్ కి వెళుతుంది. టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుందనే మొన్నటివరకు అనుకున్నారు. కానీ అమర్ అక్బర్ ఆంటొనిలో ఇలియానా ఫస్ట్ లుక్ చూడగానే ఇల్లి బేబీ మీద ఆశలు అన్ని పోయాయి. కారణం ఆమె లావుగా తయారవడమే. ప్రస్తుతం ఇలియానా నటించిన అమర్ అక్బర్ ఆంటొని థియేటర్స్ లో సందడి చేస్తుంది. 

మరి సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు. పూర్తి నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకున్న అమర్ అక్బర్ ఆంటొనిలో ఇలియానా పూజ, ఐశ్వర్య పాత్రల్లో మెప్పించలేకపోయింది. ఆమె పాత్రకి గ్లామర్ అద్దినా... నటనకు స్కోప్ లేకపోవడంతో ఇలియానా అమర్ అక్బర్ ఆంటొనిలో తేలిపోయింది. ఇలియానా బొద్దుగా మారింది. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ తొలి సీన్ల‌లో ఒక‌లా.... చివ‌రి సీన్ల‌లో మ‌రోలా ఉంది. మరీ లావైపోయిన ఇల్లీని చూసి అభిమానులు తట్టుకోలేరేమో అన్నట్టుగా ఉంది సినిమాలో. నటన పరంగా ఇలియానా బాగానే చేసింది. ఇక డాన్ బాస్కో సాంగ్‌లో కాస్త అందంగా కనిపించింది. అయితే కథలో నటించడానికి స్కోప్ లేకపోవడంతో పరిధి మేర నటించాల్సి వచ్చింది. మరి ఈ సినిమా హిట్‌తో టాలీవుడ్‌లో బిజీ అయిపోవాలని చూసిన ఇలియానాకి.. ప్రస్తుతం నడుస్తున్న టాక్ మళ్లీ గోవా ఛల్ అనేలా ఉందంటే.. టాలీవుడ్‌లో ఇలియానా పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 



By November 18, 2018 at 06:02AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43538/ileana.html

No comments