Breaking News

సూరిపై చిరంజీవికి కోపమెందుకు వస్తోంది?


రామ్ చరణ్ హీరోగానూ, నిర్మాతగాను దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలెవరు నిర్మాణ రంగంలోకి వెళ్లకపోయినా... రామ్ చరణ్ మాత్రం హీరోగానూ, నిర్మాతగానూ టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' చిత్రం షూటింగ్ తోనూ, తండ్రి చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమా నిర్మాతగానూ బాగా బిజీగా వున్నాడు. అందులోను రాజమౌళి 'RRR' కూడా స్టార్ట్ అయ్యింది. అయితే RRR షూటింగ్ కి జాయిన్ కావాలంటే... రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' ని త్వరగా పూర్తి చెయ్యాలి. అందుకే రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' షూటింగ్ లో బిజీగా ఉండడంతో.. చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడట.

'సై రా' రోల్ పోషిస్తూ సినిమా నిర్మాతగానూ చిరు 'సై రా' సినిమా విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నాడట. రామ్ చరణ్ 'సై రా' సినిమాని 200 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. అయితే హీరోగా ఎలాగున్నా  చిరు నిర్మాతగా మాత్రం సైరా సెట్ లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడ‌ని.... త‌న ముందు ఎడా పెడా ఖర్చు చేస్తూ దుబారా చేస్తుంటే ఏమాత్రం స‌హించ‌డం లేద‌ని.... అలా  ఓ సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిపై కూడా చిరు సీరియస్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. సురేందర్ రెడ్డి కొన్ని అక్కర్లేని చోట్ల ఖ‌ర్చు పెట్టిస్తున్నాడ‌న్న విష‌యం తెలిసి.. సురేంద‌ర్ రెడ్డిని పిలిచి చిరు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఫిలింనగర్ టాక్.

ఇక సురేందర్ రెడ్డి కూడా చిరు అంతటి హీరో చెబితే ఏమంటాడు.. మనసులో నొచ్చుకొన్నప్పటికీ కిమ్మనకుండా ఉండిపోయాడట. కానీ చరణ్ మాత్రం 'సై రా' సెట్స్ లో ఉంటే. సురేందర్ రెడ్డికి స్వేచ్ఛగా సినిమా చేసే అవకాశం ఇచ్చేశాడట. ఆలాగే సురేందర్ రెడ్డి మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా చూస్తున్నాడని టాక్ కూడా ఉంది. ఇక రామ్ చరణ్ 'సై రా' సెట్స్ లో ఉంటే చిరు మాత్రం నిర్మాణ పనుల్లో తల దూర్చకుండా తన పని తాను కూల్ గా చేసుకునేవాడట. కానీ చరణ్ లేకపోతేనే చిరుకి కోపమొస్తుందట. మరి చిరంజీవికి అలా తొందరగా కోపం రావడానికి మాత్రం 'సైరా నరసింహారెడ్డి' పాత్ర కోసం బాగా శ్రమించడం వలెనే అని... ఎక్కువగా అక్కడ కష్టపడి మళ్ళీ నిర్మాతగా అన్ని చూసుకోవాలంటే ఒత్తిడికి గురయ్యి కోపమొస్తుందని చిరు పక్కనున్నవారు చెబుతున్న మాట.



By November 16, 2018 at 01:33PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43519/chiranjeevi.html

No comments