Breaking News

మళ్లీ.. సాయిపల్లవిదే డామినేషన్..?


సాయి పల్లవి ఏ హీరో పక్కన నటించినా ఆ సినిమాలో హీరోని డామినేట్ చేస్తుంది అనేది ఆమె గత చిత్రాలు క్లియర్ గానే చెబుతున్నాయి. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ ని తోక్కేసిన సాయి పల్లవి... ఎంసీఏ లో నాని తో కలిసి నటించినా...నేచురల్ స్టార్ నాని పక్కన కూడా డామినేట్ చేసింది. అయితే అప్పట్లో ఎంసీఏ సినిమాలో సాయి పల్లవి సీన్స్ కొన్ని ఎడిట్ చేయడం వల్లనే ఆ సినిమాలో సాయి పల్లవి పాత్ర తగ్గిందని.. అందుకే నాని మీద సాయి పల్లవి కావాలనే ఆరోపణలు చేసిందనే టాక్ నడిచింది. అలాగే కణం సినిమాలో అయితే అడుగడుగునా సాయి పల్లవి డామినేషన్ నాగ సౌర్య మీదే కనబడింది. ఇక ఆ విషయంలో నాగ సౌర్య హర్ట్ అవడమూ... తర్వాత కణం ప్రమోషన్స్ నాగ సౌర్య పాల్గొనకుండా సాయి పల్లవి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది.

ఇక శ్రీనివాస కళ్యాణంలో సాయి పల్లవి హీరోయిన్ పాత్ర కి హైప్ లేకపోవడంతో ఒప్పుకోలేదనే టాక్  నడిచింది. తాజాగా శర్వానంద్ తో కలిసి పడి పడి లేచే మనసు సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి ఎప్పటిలాగే తన డామినేషన్ శర్వా మీద చూపించేస్తుంది. మామూలుగానే సాయి పల్లవి డ్యాన్స్, ఆమె లుక్స్, ఆమె హావభావాలు, ఆమె నటన ముందు ఏ హీరో అయినా తేలిపోతాడనేది తెలిసిందే. అందుకే ఆమెకు స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు రావడం లేదనే టాక్ కూడా ఉంది. అయితే ఇప్పుడు పడి పడి లేచే మనసులో కూడా సాయి పల్లవి డామినేషన్ మాత్రం అప్పుడే కనబడుతుంది. తాజాగా వదిలిన తొలి సింగిల్ లో సాయి పల్లవి ముందు శర్వానంద్ తేలిపోయాడనే చెప్పాలి.

ఆ సింగిల్ లో అందరూ సాయి పల్లవిని చూస్తున్నారు కానీ... శర్వాని చూడలేకపోయారంటే... అక్కడ సాయి పల్లవి డామినేషన్ ఎంత ఇదిగా ఉందో అర్ధమవుతుంది. ఆ పాటలో సాయి పల్లవి అందం ఆమె ఫేస్ లోని అట్రాక్షన్... ఆమె మీద నుండి చూపు మరల్చుకోనట్లు చేస్తుంది. మరి ఈ పాట చూసాక ఈ సినిమా సాయి పల్లవి ఒప్పుకోవడానికి కారణం స్పష్టంగానే అర్ధమవుతుంది. ఏదిఏమైనా సాయి పల్లవికి మాత్రం అదే ప్లస్ అవుతుంది కూడా...!

Click Here for Song



By November 25, 2018 at 03:59AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43638/damnation.html

No comments