Breaking News

నన్ను నేనే గిల్లుకున్నా.. : సిమ్రాన్


సూపర్ స్టార్ రజినీకాంత్, కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పెట్టా’. సిమ్రాన్, త్రిష నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందని చెప్పారు కానీ.. ఈ చిత్రం సంక్రాంతికి రావడం లేదని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. రెండు విభిన్న పాత్రలలో రజినీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రజినీకాంత్ కాలేజీ హాస్టల్ వార్డెన్‌గా, మరో రోల్‌లో సైనిక అధికారిగా ఇందులో నటిస్తున్నారు. అయితే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల అవ్వడం లేదనే వార్తలను ఖండిస్తూ.. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల ఉంటుందంటూ.. తాజాగా ఓ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో రజినీకాంత్‌తో పాటు సిమ్రాన్ కూడా నవ్వుతూ కనిపించింది. ఈ పోస్టర్ గురించి తాజాగా సిమ్రాన్ తన ట్విట్టర్ పేజీలో ఆసక్తికరంగా పోస్ట్ చేసింది.

నిజంగా ఈ పోస్టర్‌లో రజినీసార్ పక్కన ఉన్నది నేనేనా.. అంటూ ఆశ్చర్యపోతున్నానని ఆమె తెలిపింది. ఇది నిజమా.. లేక కల అనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నానంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓమై గాడ్‌.. రజినీసార్‌తో నేను నటించడం.. నిజంగా ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నా.. నన్ను నేనే గిల్లుకుని చూసుకుంటున్నా..’ అంటూ ఆమె కొన్ని ఎమోజీలను పోస్ట్‌ చేశారు. ఈ పోస్టర్‌ చూసిన వారు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత సిమ్రాన్ కనిపించడం, అలాగే రజినీ పక్కన చాలా హుందాగా కనిపించడంతో.. ఈ కాంబినేషన్ గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు.



By November 16, 2018 at 11:13AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43518/simran.html

No comments