Breaking News

దీపికను వాళ్ల మామ ఏమని వర్ణించారంటే..??


దీపికా పదుకునె, రణ్‌వీర్ సింగ్.. ఈ ఇద్దరి పేర్లు సుమారు నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరి ప్రేమ వ్యవహారం కూడా చాలా రహాస్యంగా జరిగింది. వీరిద్దరూ కొట్లాడుకుంటూ ఉన్నట్టే కనిపించారు. ఒకానొక సందర్భంలో ఒకరినొకరు దూషించుకున్నారు కూడా. ఇదంతా మీడియాని నమ్మించడానికే. ఎక్కడ వీరి ప్రేమ వ్యవహారం బయటపడుతుందో అని.. వారిద్దరూ ఓ అండర్‌స్టాండింగ్‌తో చేసిన పని అది. అయినా మీడియా వారిని ఎప్పటి కప్పుడు ఫోకస్ చేస్తూ.. వార్తలు గట్టిగానే దట్టించి.. వారి మధ్య ఏదో నడుస్తుందని రాసుకొచ్చింది.

ఇక అన్ని వ్యవహారాలు ముగిశాయి. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కటి కూడా అయ్యారు. ఇటలీలోని లేక్ కోమోలో కొంకణి, సింధి సంప్రదాయాలలో రెండు రకాలుగా పెళ్లి తతంగం పూర్తయింది. ఈ జంట ఇటలీ నుంచి నవంబర్ 18న భారత్‌కు రానుంది. భారత్‌కు వచ్చిన తర్వాత 21న బెంగళూరులో, 28న ముంబాయిలో గ్రాండ్‌గా రిసప్షన్ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

అయితే పెళ్లి సమయంలో దీపికా పదుకునె గురించి ఆమె మామగారైన జగ్జీత్‌ సరదాగా ఓ మాట అన్నారట. ‘యే దివానీ తో భవ్నానీ హో గయీ’ అని. దీనిని ‘దీప్‌వీర్’ పెళ్లికి హాజరైన కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ అయింది. దీపికను వాళ్ల మామగారు అన్నమాట ఎక్కడిదో కాదు. రణ్‌వీర్‌, దీపిక జంటగా నటించిన ‘బాజీరావ్‌ మస్తానీ’లోని ‘మస్తానీ’ పాటలోని లైన్‌. ‘యే దివానీ మస్తానీ హోగయీ..’ అన్నది పాటలోని అసలు పదం. అంటే బాజీరావ్‌ను చూసి మస్తానీ దివానీ(ఫిదా అయిపోయింది) అని దానర్థం. ‘యే దివానీ తో భవ్నానీ హో గయీ’ అని దీపిక మామగారు అన్నమాటకు అర్ధం.. ఇప్పడు దీపిక మస్తానీ నుంచి భవ్నానీగా మారింది అని అర్ధం. రణ్‌వీర్‌ సింగ్‌ పూర్తి పేరు రణ్‌వీర్‌ సింగ్‌ భవ్నానీ. అంటే దీపికా భవ్నానీ అని అర్ధం వచ్చేలా ఆయన వర్ణించిన తీరును ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ షేర్ చేస్తూ.. హడావుడి చేస్తున్నారు.



By November 18, 2018 at 10:28AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43543/deepika-padukone.html

No comments