Breaking News

షూ ఖరీదే అంత.. మళ్లీ సాధారణ జీవితమంట!!


ఎవరి పిల్లలు వారికి ముద్దు అంటారు. అందుకే మన పెద్ద వాళ్లు కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెతను చెబుతుంటారు. నవమాసాలు మోసి కన్నపిల్లలు ఎలా ఉన్నా.. తల్లిదండ్రులకు నచ్చేస్తారు. అయితే పిల్లలు ఎలా ఉన్నారు అనేది కాదు.. వారి ప్రవర్తన ఎలా ఉంది అనేదే ఇప్పుడున్న సమాజంలో చాలా ముఖ్యమైన విషయం. ఇక విషయంలోకి వస్తే బాలీవుడ్ బాద్‌షా.. తన కూతురు ప్రపంచంలోనే పెద్ద అందగత్తె అంటూ కితాబివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కోల్‌కత్తాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే సెలబ్రిటీలు ఎవ్వరూ తమ పిల్లలు అందంగా ఉన్నారని ఇలా పబ్లిక్‌గా ఇప్పటి వరకు చెప్పలేదు. అందుకే షారూఖ్ అన్న ఈ మాటలపై సర్వత్రా ఆశ్చర్యం నెలకొంది.

‘‘శరీర రంగును బట్టి మనిషిని అంచనాలు వేస్తుంటారు. అది చాలా తప్పు. మనిషి శరీర రంగును చూసి.. వీరు అలాంటి తరహా మనుషులు అని అంచనాలు వేయకూడడు. మనిషి అందంగా ఉంటే గొప్ప వ్యక్తి అయిపోడు. ఆ అందం వెనుక మంచి మనసు ఉంటేనే వారు గొప్ప వ్యక్తులు అవుతారు. నా విషయానికి వస్తే.. చిన్నప్పుడు నేను నాకు అత్యంత ఇష్టమైన వారి ఫొటోలను నా గదిలోని గోడలపై అంటించుకునేవాడిని. కానీ ఇప్పడు నా ఫొటోలను అలా చాలా మంది అంటించుకుంటున్నారు. నిజానికి నేను అసలు యాక్టింగ్ స్కూల్‌కి కూడా వెళ్లలేదు. నాకు నటన అస్సలు రాదు. అందుకే ఎవరైనా.. ఎవరి నటన గురించైనా చెప్పమని అడిగినప్పుడు నాకు ఆ అర్హత లేదని చెప్పేస్తాను.

నాది దిగువ మధ్య తరగతి కుటుంబం. అందుకే ఇప్పటికీ సాధారణ జీవితమే గడుపుతాను. నా కుటుంబం కూడా సాధారణ జీవితాన్నే ఇష్టపడుతుంది. ఎంత సంపాదించినా.. మంచి మనిషి అనే పేరు లేదంటే.. సంపాదించింది దేనికి పనికిరానట్లే లెక్క. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. నా కూతురు మంచి కలర్ కాదు. చామన ఛాయలో ఉంటుంది. కానీ మంచి మనసు ఉంది. అందుకే నా దృష్టిలో ఆమె ప్రపంచంలోనే గొప్ప అందగత్తెగా భావిస్తాను. మనసున్న వారికి కలర్‌తో పనేముంది..’’ అని షారూఖ్ పెద్ద ప్రసంగమే ఇచ్చాడు.

అయితే అంతా బాగానే ఉంది కానీ, ఆయన కూతురు ప్రపంచ అందగత్తె కావచ్చు. కలర్ తక్కువ కావచ్చు. కానీ మా కుటుంబం అంతా సాదారణ జీవితానికి ఇష్టపడతారు అనేదానిపైనే షారూఖ్‌పై సెటైర్లు పడుతున్నాయి. ఇటీవల తన కూతురు కాళ్లకు వేసిన షూ ఖరీదు సుమారు 70 వేలు, అలాగే ఇటీవల ఓ ఫంక్షన్‌కు వేసిన డ్రస్సు విలువ లక్షల్లో ఉంది. మరి షారూఖ్ దృష్టిలో సాదారణ జీవితం అంటే ఇదేనేమో..అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 



By November 16, 2018 at 04:32AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43510/shah-rukh-khan.html

No comments