Breaking News

మెగా బ్రదర్స్ కలవబోతున్నారు..!!


తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్‌ హీరోలలో రానా, నిఖిల్‌ వంటి వారితో పాటు విభిన్న చిత్రాలు చేస్తున్న హీరోగా మెగా హీరో వరుణ్‌తేజ్‌ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘అంతరిక్షం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సబ్‌మెరైన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రానాతో ‘ఘాజీ’ వంటి చిత్రాన్ని తీసి ప్రశంసలు పొందిన సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఘాజీ’ చిత్రాన్ని అతి తక్కువ కాలంలో అంతే తక్కువ బడ్జెట్‌తో రిచ్‌ లుక్‌ తెచ్చిన ఘనత సంకల్ప్‌రెడ్డికి దక్కుతుంది. దాంతో ఆయన దర్శకత్వ ప్రతిభను మెచ్చి మరో క్రియేటివ్‌ దర్శకుడు క్రిష్‌ ఈ ‘అంతరిక్షం’ మూవీని నిర్మిస్తున్నాడు. ఇది తొలి టాలీవుడ్‌ స్పేస్‌ థ్రిల్లర్‌ కావడం విశేషం. 

ఇక ‘ఘాజీ’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోయింది. కమర్షియల్‌గా ఓకే అయినా కూడా అన్ని వర్గాలకు రీచ్‌ కాలేకపోవడంతో ఈ ‘అంతరిక్షం’ చిత్రానికి భారీ ప్రమోషన్స్‌ చేసి డిసెంబర్‌ 21న విడుదల చేయాలని భావిస్తున్నారు. అందులో అదే రోజున హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్‌-సాయిపల్లవి నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’, కన్నడ స్టార్‌ యష్‌ నటిస్తున్న ‘కేజీఎఫ్‌’లతో పాటు ‘అంతరిక్షం’ కూడా అదే రోజున పోటీలోకి దిగుతోంది. దీంతో ఈసారి వరుణ్‌తేజ్‌ మూవీకి పెదనాన్న మెగాస్టార్‌ చిరంజీవి, బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ల అండ తీసుకోవాలని వరుణ్‌తేజ్‌ నిర్ణయించాడట. 

అందుకోసమే ఎన్నో తేదీలు వెతికి చివరకు కాస్త ఆలస్యంగానైనా ఇద్దరికీ వీలుపడే డేట్‌గా డిసెంబర్‌ 9ని ఎంచుకుని ఆరోజున ‘అంతరిక్షం’ ప్రీరిలీజ్‌ వేడుకను ఫిక్స్‌ చేశారు. ఈ వేడుకలో చిరు, పవన్‌లు విభిన్న చిత్రాలు చేస్తున్న వరుణ్‌తేజ్‌, సంకల్ప్‌రెడ్డిలను బాగా పొగిడి ప్రమోషన్స్‌ చేయనున్నారు. మరి సంకల్ప్‌రెడ్డి ద్వితీయ విఘ్నంని అధిగమిస్తే ఆయన క్రేజ్‌ మరింతగా పెరిగి స్టార్స్‌ చూపు కూడా ఆయనపై పడటం ఖాయమనే చెప్పాలి. 



By November 26, 2018 at 11:09AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43664/chiranjeevi.html

No comments