Breaking News

స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ నయనతార!


నయనతార.. ఈ మలయాళ కుట్టి మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి వారితో నటించినా కూడా రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రం ఈమెకి కోలీవుడ్‌లో, టాలీవుడ్‌లో ఎనలేని క్రేజ్‌ని తీసుకొచ్చింది. కెరీర్‌ మొదట్లో ఈమె పలు స్టార్స్‌ చిత్రాలలో గ్లామర్‌ పాత్రలు చేసింది. తెలుగులో కూడా రవితేజ, ప్రభాస్‌, వెంకటేష్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, నాగార్జునతో పాటు దాదాపు అందరు స్టార్స్‌తో చేసింది. ఇక ఇటీవల ఈమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ వస్తోంది. మధ్యలో వీలున్నప్పుడు గ్లామర్‌ పాత్రలకు కూడా ఓకే అంటోంది. 

అయితే ప్రస్తుతం దక్షిణాదిన సూపర్‌స్టార్‌ హోదాలో అత్యధిక ఫాలోయింగ్‌, పారితోషికం పొందుతున్న ఈమె ప్రమోషన్స్‌కి రాకపోయినా, హీరోలను లెక్కచేయకపోయినా కూడా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఈమె బాలకృష్ణతో ‘శ్రీరామరాజ్యం, సింహా’ చిత్రాల తర్వాత జైసింహా’లో నటించింది. ‘కర్తవ్యం’ పేరుతో డబ్బింగ్‌ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సత్తా చాటింది. ఇక ప్రస్తుతం ఈమె మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’లో యాక్ట్‌ చేస్తోంది. తాజాగా ఈమె తొమ్మిదేళ్ల తర్వాత తమిళస్టార్‌ విజయ్‌ సరసన నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

ఇక విషయానికి వస్తే విజయ్‌ - అట్లీ కుమార్‌లది కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘తేరీ, మెర్సల్’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇక అట్లీకి మంచి గుర్తింపును తీసుకొచ్చిన ‘రాజు-రాణి’ చిత్రంలో కూడా నయనతార నటించింది. ఇది విజయ్‌కి 63వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఇందులో విజయ్‌ సరసన నయన నటించడం కోలీవుడ్‌లో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ చిత్రంతో ‘విజయ్‌-అట్లీ’ల కాంబినేషనే కాదు.. నయనతార నటిస్తుండటం వల్ల ఈ మూవీ పెద్ద బ్లాక్‌బస్టర్‌ ఖాయమని అంటున్నారు. ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్‌ను ప్రారంభించుకుని, వచ్చే ఏడాది చివర్లోనే విడుదలకు సిద్దమవుతోంది. 



By November 27, 2018 at 12:03PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43676/nayanthara.html

No comments