ఆమెతో డేటింగ్ నిజమే.. హీరో క్లారిటీ!!
ఈ మధ్య టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా.. నటులు, నటీమణులు.. వారివారి సహచరులను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం వంటివి జరిగిపోతున్నాయి. టాలీవుడ్‌లో మహేష్ బాబు ఇప్పటికీ ఈ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే అతిశయోక్తి కాదు. ఇప్పడు బాలీవుడ్‌లో ఈ కల్చర్ బాగా పెరిగిపోతోంది. రణవీర్ సింగ్, దీపికా పదుకునెలే దీనికి ఉదాహరణ. ఈ జంట ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు మరోజంట అదేబాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. అవ్వడం ఏమిటీ ఆల్రెడీ అయిపోయామని కూడా వారు పబ్లిగ్గా చెప్పేశారు.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, డిజైనర్ నటాషా దలాల్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ తాజాగా ఓ షోలో చెప్పేశాడు. వాస్తవానికి వీరిద్దరిపై ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి తిరుగుతున్న ఫొటోలు కూడా ఈ మధ్య నెట్లో బాగానే హల్‌చల్ చేస్తున్నాయి. ఇక వాళ్లు, వీళ్లు అనుకోవడం ఎందుకని భావించాడో ఏమో.. గానీ.. నిర్మాత కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో అసలు విషయం బయటపెట్టేశాడు వరుణ్.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోస్‌లో వరుణ్..‘అవును.. ఆమెతో డేటింగ్‌లో ఉన్నా. మేమిద్దరం ప్రేమికులం. ఆమెను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నా. త్వరలోనే ఆ వార్త చెబుతాను’ అని తెలిపాడు. అయితే ఇంతకు ముందు మీడియా గుచ్చి గుచ్చి అడిగినా కూడా చెప్పని వరుణ్ ధావన్.. ఈ షోలో మాత్రం నటాషా గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. మొత్తానికి రణవీర్, దీపికాల పెళ్లి తర్వాత మరో జంట పెళ్లికి రెడీ అవుతుందన్నమాట.
By November 14, 2018 at 09:07AM
No comments