Breaking News

వావ్.. కొరటాల తర్వాత లైన్‌లోకి త్రివిక్రమ్..!!


దాదాపు 30 సంవత్సరాలుగా టాలీవుడ్‌ని ఏలుతున్న మగధీరుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కొంతకాలం రాజకీయాలంటూ ఇండస్ట్రీని వదిలివెళ్లినా.. ఆ నెంబర్1 ఛైర్‌ని సాధించడం మాత్రం ఎవరితరం కాలేదు. ఇక పాలిటిక్స్ తన వంటికి సరిపడవని త్వరగానే గమనించిన చిరంజీవి రైట్‌ టైమ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి.. మరోసారి ‘ఖైదీ’ని అందరి మనసులను దోచుకున్నాడు. ఇప్పడు ‘సైరా’ అంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న చిరంజీవి, వెంటనే కొరటాలతో సినిమాని కూడా లైన్‌లో పెట్టేశారు.

ఇక కొరటాల శివతో స్ర్కిఫ్ట్ గురించి చర్చలు జరిగాయో లేదో.. ఇప్పుడు చిరంజీవి మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ ఫిల్మ్ సర్కిల్స్ వార్తలు మొదలయ్యాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు. మెగా ఆస్థాన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును.. ఇటీవలే త్రివిక్రమ్.. చిరంజీవి అన్ని విధాలుగా సరిపడే ఓ కథను తయారు చేసి వినిపించాడట. త్రివిక్రమ్ చెప్పిన ఆ కథ చిరు ఎంతగానో ఎక్సైట్ చేసిందని, తప్పకుండా ఈ సినిమా మనం చేస్తున్నాం అని చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ ఆస్థాన బ్యానర్ అయినటువంటి హారికా అండ్ హాసిని బ్యానర్‌లోనే త్రివిక్రమ్ చేయనున్నాడని కూడా టాక్.

ఇదిలా ఉంటే.. కొరటాలతో సినిమా తర్వాత చిరంజీవి.. బోయపాటితో సినిమా చేస్తాడని ఇప్పటి వరకు వార్తలు నడిచాయి. ఇప్పుడు వినిపిస్తున్న ఈ వార్తలు చూస్తుంటే.. బోయపాటితో చిరు సినిమా మరింత ఆలస్యం అయ్యేలానే కనిపిస్తుంది. అసలు ఈ కాంబినేషన్‌లో మూవీ ఉంటుంది, లేనిది తెలియాలనేది ‘వినయ విధేయ రామ’ సక్సెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ మూవీ సక్సెస్ అయితేనే బోయపాటికి మెగాస్టార్ నుంచి అవకాశం ఉంటుంది. లేదంటే బోయపాటికి ఇక మెగా అవకాశం వచ్చే ఛాన్స్ కష్టమే. ఒక వేళ చరణ్‌తో ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘వినయ విధేయ రామ’ కనుక హిట్ అయిందా.. చిరంజీవికి మరో మూవీ లైన్‌లో ఉన్నట్లే. కొరటాల, త్రివిక్రమ్, బోయపాటి.. అబ్బో చిరు స్పీడ్ మాములుగా లేదు కదా..!



By November 18, 2018 at 01:23PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43545/chiranjeevi.html

No comments