‘వినయ విధేయ రామ’ బిజినెస్ మొదలైంది!
‘రంగస్థలం’ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అందుకోవడమే కాదు 100 కోట్లు షేర్ ను వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశాడు చరణ్. దాంతో అతను చేసే నెక్స్ట్ మూవీ కోసం భారీ అంచనాలతో వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం రామ్ చరణ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉందీ సినిమా.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. క్లాసీ టైటిల్ తో మాసీ టీజర్ తో అదరకొట్టేశారు చరణ్ - బోయపాటి. ‘వినయ విధేయ రామ’ అన్న టైటిల్ ఏమో క్లాస్ ఆడియన్స్ కి కనక్ట్ అయితే టీజర్ ఏమో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో సినిమా యొక్క బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఇప్పటికే హిందీ రైట్స్ ని భారీ మొత్తానికి అమ్మేశారన్న సమాచారం ఉంది. హిందీ డబ్బింగ్ - శాటిలైట్ కలిపి 22కోట్లు పలికిందని వార్తలొచ్చాయి. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ అయితే ఇదే.
అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరిద్దరూ తమ సత్తా చాటుకున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భారీ కాంపిటీషన్ నడుమ 5.6 కోట్లకు డీల్ కుదిరిందిట. ఎన్ ఆర్ ఏ బేసిస్ లో గీతా ఫిలింస్ సంస్థ హక్కులు కొనుక్కుంది. మిగిలిన ఏరియాస్ కూడా త్వరలోనే బిజినెస్ జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ‘రంగస్థలం’ సినిమాను 4.2 కోట్లకు రైట్స్ కొనుక్కుంటే - 6.35కోట్ల షేర్ వసూలు చేసింది. ‘రంగస్థలం’ కి మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ వసూల్ వచ్చింది. ఇప్పుడు అదే రకంగా ‘వినయ విధేయ రామ’ కు టాక్ వస్తే వసూల్ రికవరీ పెద్ద విషయం ఏమి కాదు. ఇక సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.
By November 18, 2018 at 05:15AM
No comments