చిట్టి, నా పాత్రలే హైలెట్: అమీజాక్సన్
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘2.0’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ చిత్రానికి సీక్వెల్‌గా ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, కరణ్ జోహర్ సమర్పణలో సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా త్రిడి ఫార్మాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్‌లో సౌండ్ డిజైన్ చేయడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 3న చెన్నైలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరోయిన్ ఎమీ జాక్సన్ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా నెర్వస్‌గా ఉన్నా. రజనీకాంత్‌గారితో కలిసి పనిచేయడం చాలా గొప్ప గౌరవం. దర్శకనిర్మాతల వల్లనే నా కల నెరవేరింది. యానిమేట్ చేసిన రోబోలాగా నటించాను. రోబోలాగా డ్యాన్స్ చేయమన్నారు. చిట్టి, నా పాత్రలు చాలా బాగా ఉన్నాయి. శంకర్ మూడేళ్ల ముందు చెప్పిన కథ ఈ రూపం రావడానికి వేల మంది పనిచేశారు. రజనీగారితో, అక్షయ్ గారితో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నీరవ్‌గారితో మూడో సినిమా చేస్తున్నా. ముత్తురాజ్‌గారు చాలా కష్టపడ్డారు. 4డీ గురించి కూడా నాకు తెలియదు. ఆంటోనీతో నాలుగో సినిమా చేశాం. రెహమాన్‌గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. సుభాష్ కరణ్‌కి థాంక్స్’’..అని అన్నారు.
By November 05, 2018 at 07:24AM
No comments