‘టాక్సీవాలా’ని.. ‘మినిబాహుబలి’ అంటున్నాడు!
తెలుగు యంగ్‌స్టార్స్‌లో సెన్సేషనల్ స్టార్ విజయ్‌దేవరకొండ రూటే వేరు. ఆయన తన ప్రతి చిత్రానికి తన సినిమా కంటెంట్‌తోపాటు తనదైన యాటిట్యూడ్, మాటల ద్వారా కూడా సినిమాకి విపరీతమైన ప్రమోషన్స్‌ని చేసి పెట్టడంలో తనదైన శైలిని ఏర్పరచుకున్నాడు. ఇంత తక్కువ చిత్రాల అనుభవంతోనే తలపండిన హీరోల కంటే తనని తాను ప్రమోట్ చేసుకోవడం ఎలా? అన్నది ఈయనను చూసే నేర్చుకోవాలి. ‘అర్జున్‌రెడ్డి’ సందర్భంగా వేడుకకు వచ్చిన వారి చేత బూతుపదం పలికించడం, కాంగ్రెస్‌సీనియర్ నేత వి.హన్మంతరావుని తన చిత్రంలోని కిస్ ఇచ్చే పోస్టర్ ద్వారా చిల్ తాతయ్యా అంటూ వర్మ నుంచి కూడా సపోర్ట్ పొంది, అర్జున్‌రెడ్డి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు.
ఇక ‘గీతాగోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని, ‘నోటా’ వంటి డిజాస్టర్ చిత్రాన్ని కూడా తనదైన మాటలు, ఇంటర్వ్యూల ద్వారా హాట్‌టాపిక్‌గా మార్చివేశాడు. తాజాగా ఆయన నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో ఈ చిత్రాన్ని ‘మినీ బాహుబలి’తో పోల్చి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈ చిత్రం గురించి.. ఇతర పలు విషయాల గురించి ఆయన మాట్లాడాడు. ఈ చిత్రం ఆలస్యం కావడానికి కారణం ఇదో మినిబాహుబలి చిత్రం కావడమే. ‘బాహుబలి’కి 2700 షాట్స్ ఉంటే, టాక్సీవాలాకు 640 షాట్స్ ఉన్నాయి. అందుకే బాగా సమయం పట్టింది. ‘గీతాగోవిందం’ చిత్రం ఎప్పుడు విడుదల కావాలి అనేది అల్లుఅరవింద్ గారే డిసైడ్ చేశారు. ఎందుకంటే ‘టాక్సీవాలా’ గ్రాఫిక్ షాట్స్‌కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే అరవింద్ గారు ముందుగా ‘గీతాగోవిందం’ విడుదల చేద్దామని చెప్పారు. ఇదో సైన్స్‌ఫిక్షన్‌తో నడిచే చిత్రం. ఓ కుర్రాడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం సిటీకి వెళ్తాడు. కానీ ఉద్యోగం దొరకదు. నగరంలోని క్యాబ్‌డ్రైవర్లు బాగా సంపాదిస్తున్నారని తెలుసుకుని తాను డ్రైవర్ కావాలనుకుంటాడు. అలా తనకు నచ్చిన ఓ పాత కాలం కారుని తీసుకుని దానిని నడుపుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు.
నాకు హర్రర్ చిత్రాలంటే భయం. నేను నటించనని చెప్పాను. కానీ ఒకరోజు యూవీక్రియేషన్స్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. కొత్త దర్శకుడు ఉన్నాడు. అతను చెప్పే కథ విను అన్నారు. రాహుల్‌ని కథ చెప్పమన్నాను. ఇదో హర్రర్ జోనర్ అన్నాడు. దాంతో నేను సీటులో నుంచి వెళ్లిపోయాను. అప్పుడు రాహుల్ నన్ను ఆపి కథ అంతా చెప్పాడు. కాన్సెప్ట్ నచ్చి ఓకే చేశాను... అని ఈ చిత్రం గురించి ఆసక్తిని కలిగించే కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన మాటలే బాగా ప్రచారం పొందుతూ ఉండటం విశేషం.
By November 10, 2018 at 05:01AM
No comments