Breaking News

నిజంగానే ట్రైలర్ చాలా బాగుంది..!!


సైన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్స్‌కి మొదటి నుంచి తెలుగులో ఆదరణ ఉన్నా కూడా వాటిని వేళ్ల మీద లెక్కించవచ్చు. ఆమద్య హీరో నిఖిల్‌.. చందు మొండేటిని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘కార్తికేయ’ చిత్రం తీశాడు. ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక దీనికి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ‘సవ్యసాచి’ ప్రమోషన్స్‌లో దీనికి సీక్వెల్‌ని తీసే పరిపక్వత నాకింకా రాలేదని చందు మొండేటి అన్నాడు. ఇక నేటి రోజుల్లో కంటెంట్‌ బాగుంటే ఎంత లోబడ్జెట్‌ చిత్రాలనైనా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అదే ఉద్దేశ్యంతో కాబోలు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌ ఇప్పుడు అదే తరహా కాన్సెప్ట్‌తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

ఇటీవలే ఆయన ‘మళ్లీరావా’ చిత్రంతో ఓకే అనిపించుకున్నాడు. ‘ఇదంజగత్‌, ఎన్టీఆర్‌’ చిత్రాలలో నటిస్తున్నాడు. ముఖ్యంగా ఈయన తన తాత పాత్రను పోషిస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలోని లుక్‌కే భారీగా స్పందన వచ్చింది. ఇక విషయానికి వస్తే సుమంత్‌, ఈషారెబ్బా జంటగా నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం టీజర్‌ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒకడిని సిద్దం చేసే ఉంచాడు’ అని సాగిన టీజర్‌ తరహాలోనే తాజాగా విడుదలైన ట్రైలర్‌ కూడా ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగింది. సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో జరిగిన అంతుచిక్కని సంఘటనలు, దాని అంతు చూసే దాకా విశ్రమించేది లేదని భీష్మించుకున్న హీరో నేపధ్యంలో ఈ చిత్రం సాగనుందని ట్రైలర్‌ ద్వారా అర్ధమవుతోంది. 

‘దేవుడి మహిమా? లేక మానవుని మేధస్సా?’ అనేది చూద్దాం అనే కాన్సెప్ట్‌తో మూవీ స్థూలకథ ఉండనుంది. ‘ఏదో జరుగుతోంది ఈ ఊర్లో?’.. ‘గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల కిందటే అంతరించి పోయిన భాష’, ‘మేమంతా ఆ దేవుడినే సెర్చ్‌ చేస్తున్నాం.. నువ్వేమో ఆ దేవుడి మీదనే రీసెర్చ్‌ చేస్తున్నావు. వీటి వెనుక దేవుడు ఉన్నా సరే.. నా కళ్లతో చూసే వరకు, నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరిని వదిలే ప్రసక్తే లేదు, ఈ దేవాలయంలో ఏమైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్‌?, నీకు దేవునిపై నమ్మకం లేకుంటే అది నీ ఖర్మ, గెలవడానికి ఆ భగవంతుని సాయం కావాలని నేను నమ్ముతాను. కానీ నువ్వు ఆ భగవంతుడినే గెలుస్తావ్‌ అంటున్నావ్‌, దేవుడి మహిమా? మానవ మేధస్సా? చూద్దాం’ అంటూ సాగే సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీని బాగా పెంచుతున్నాయి. ఇక సీనియర్‌ నటులైన సాయికుమార్‌, సురేష్‌ కీలకపాత్రలను పోషిస్తుండగా, సంతోష్‌ జాగర్లమూడి టేకింగ్‌, శేఖర్‌ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సినిమాటోగ్రఫీ వంటివి చాలా బాగున్నాయి. మరి ఈ చిత్రం కూడా డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ని నమ్ముకుంటున్న సుమంత్‌కి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూద్దాం. 

Click Here for Trailer



By November 23, 2018 at 07:58AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43611/subrahmanyapuram.html

No comments