Breaking News

నా జీవితంలో కొత్త మలుపు ‘శరభ’: జయప్రద


ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి జంటగా సీనియర్ నటి జయప్రద ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం “శరభ”. ఎన్‌.నరసింహరావు దర్శకత్వం వహించగా ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అశ్వని కుమార్ సహదేవ్ నిర్మించారు. న‌వంబ‌ర్ 22న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆర్‌.నారాయణమూర్తి మేకింగ్‌ వీడియోను విడుదల చేయగా, ట్రైలర్‌ను జయప్రద, ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు విడుదల చేశారు.  

ఈ సందర్భంగా దర్శకుడు నరసింహరావు మాట్లాడుతూ 'సినిమా తీయడానికి చాలారోజులు పట్టింది అలాగే విడుదలకు కూడా. నవంబర్‌ 22న విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. 'ఎర్రసైన్యం'తో ఇండస్ట్రీలోకి వచ్చాను. నా గురువు నారాయణమూర్తి గారు ఇచ్చిన ఫౌండేషనే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. భీమనేని శ్రీనివాసరావు, బాలశేఖర్‌, శంకర్‌ లాంటి గొప్ప దర్శకుల వద్ద 20 ఏళ్లు వర్క్ చేసిన అనుభవంతో ఈ సినిమా చేశాను. ఈ ఛాన్స్ ఇచ్చిన అశ్వని కుమార్‌ గారికి థ్యాంక్స్. సున్నితంగా పెరిగిన ఆకాశ్‌ను చాలా కష్టపెట్టాను. మిస్టీ చాలా బాగా చేసింది. జయప్రద గారి వంటి మహానటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఎంత అద్భుతంగా నటించారో సినిమాలో చూడొచ్చు. ఆమె ఒప్పుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆవిడకు థ్యాంక్స్. కోటి, రామ్‌ లక్ష్మణ్‌, చంటి గారు వంటి పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారు. వారిందరికీ పేరుపేరున థ్యాంక్స్. చదలవాడ శ్రీనివాసరావుగారికి, నా కోసం వచ్చిన నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు' తెలియజేశారు. 

నిర్మాత అశ్వని కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. 'సిన్సియర్‌ ఎఫర్ట్‌తో ఈ సినిమా రూపొందించాం. జయప్రద గారు నటించడం సంతోషంగా ఉంది. నవంబర్‌ 22న విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులు ఈ సినిమా ఆదరస్తారని ఆశిస్తున్నాను' అన్నారు. 

హీరో ఆకాష్ కుమార్ మాట్లాడుతూ.. “ఇలాంటి మంచి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు. 

హీరోయిన్‌ మిస్టీ చక్రవర్తి మాట్లాడుతూ 'మా అందరికీ ఇది స్పెషల్ మూమెంట్. చాలా కష్టపడి ఈ సినిమాకు వర్క్ చేశాం. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఆకాశ్‌కు ఇది తొలిచిత్రం. అతనికి నా బెస్ట్ విషెస్. ఇలాంటి సినిమాలో ఓ భాగం అయినందుకు ఆనందంగా ఉంది. టెక్నీషియన్స్ అందరి సహకారం లేకుండా ఇలాంటి సినిమాలు చాలా కష్టం. అందరికీ థాంక్స్'. 

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ 'నేను ఈ సినిమా ఫీల్డ్‌లో పుట్టడానికి కారణం కేవలం జయప్రద గారే. నేను తెనాలిలో ఏమీ లేని స్టేజ్‌లో నేల టికెట్‌ చూసే రోజుల్లో ఆవిడ 'సీతారాములు' సినిమా చూశాను. ప్రపంచంలో ఇంత అందమైన లేడీని ఎక్కడా చూడలేదు. నా జన్మలో ఎప్పటికైనా ఈమెతో ఓ సినిమా తీయాలి అని ఫ్రెండ్స్ తో చెప్పాను. ఈ మాట జయప్రదగారితో కూడా ఇప్పటివరకూ చెప్పలేదు. ఆరోజు చెప్పినట్టుగానే ఫస్ట్ సినిమా ఆమెతోనే చేశాను. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన గ్రేట్‌ ఆర్టిస్ట్ జయప్రద గారు. ఆమె నటించిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. నిర్మాత ఎంతో ఖర్చుపెట్టారు. ట్రైలర్‌ చూస్తుంటే మంచి ఓపెనింగ్స్ వచ్చే సినిమాలా అనిపిస్తోంది. రిలీజ్‌ తర్వాత సక్సెస్‌ మీట్‌కు నన్ను మళ్లీ పిలిచేలా విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అన్నారు. 

ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ 'సినిమా ఆలస్యమవుతోంది, రిలీజ్‌ అవుతుందా అని చాలామంది అపోహపడ్డారు. శంకర్‌ సినిమా '2.ఓ'నే గ్రాఫిక్స్ డిలే వల్ల వాయిదాల మీద వాయిదాలు పడింది. ఈ సినిమా కూడా గ్రాఫిక్స్ వల్లే ఆలస్యమైంది తప్ప మరొకటి కాదు. శంకర్‌కు ఈ సినిమా డైరెక్టర్‌ నరసింహారావు శిష్యుడు. ప్రారంభంలో నా వద్ద మూడు సినిమాలకు వర్క్ చేశాడు. నీలో టాలెంట్ ఉంది నాలాంటి సినిమాలు అందరూ తీయరు నువ్వు బయటకి వెళ్లి ట్రై చేయమంటే వెళ్లాడు. ఇటీవలే ఈ సినిమా చూశాను. గొప్ప సినిమా తీశాడు. కథను, దర్శకుడిని నమ్మి రూ.20 కోట్లు పెట్టి ఈ సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్‌కు హ్యాట్సాప్‌'. 

జయప్రద గారి క్యారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. నా కాలేజ్‌ డేస్‌లోనే జయప్రద గారు పెద్ద హీరోయిన్‌. రంభ, ఊర్వశి, మేనక పేర్లు మాత్రమే విన్నాం. భూతలంపై అలాంటి అందమైన వాళ్లెవరైనా ఉన్నారంటే ఆవిడే జయప్రద. ఈ మాట నేనో మీరో చెప్పింది కాదు.. ద గ్రేట్‌ డైరెక్టర్‌ సత్యజిత్‌రే అన్న మాటలివి. తెలుగు నుంచి వెళ్లి నార్త్‌లో సక్సెస్‌ అయిన ఏకైక హీరోయిన్‌ జయప్రద గారు. కమిట్మంట్‌ ఉన్న నటి, గొప్ప పొలిటీషియన్ ఆమె. ఆవిడ వయసెంతో తెలీదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. హీరోతో పాటు విలన్‌ క్యారెక్టర్‌ కూడా హీరోయిక్ గా ఉంది. అన్ని అంశాలు అద్భుతంగా కుదిరాయి. సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నా. 'బాహుబలి' తమ్ముడిలా ఆడాలని, శంకర్‌ శిష్యుడిగా నరసింహ గొప్ప డైరెక్టర్‌ అవ్వాలని కోరుతున్నా. ఏ సినిమా అయినా సక్సెస్‌ తర్వాత వచ్చే పేరు హీరోకే. ఈ సినిమాతో ఆకాశ్‌కు ఆ పేరు రావాలని ఆశిస్తున్నా. 

జయప్రద మాట్లాడుతూ.. 'తెలిసి తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగు ఇండస్ట్రీనే నన్ను ఇంతదాన్ని చేసింది. ఎప్పటికీ ఈ రుణాన్ని తీర్చుకోలేను. మళ్లీ జయప్రదగా తెలుగు బిడ్డగానే నన్ను పుట్టించాలని దేవుడుని కోరుకుంటున్నాను. అశ్వని కుమార్‌ గారి లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. పెద్ద బిజినెస్‌మేన్‌ అయిన ఆయన దుబాయ్‌లో మహారాజులా ఉండొచ్చు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోను పరిచయం చేయాలనే ఒక ధైర్యంతో తనకొడుకు ఆకాశ్‌ను ఇంట్రడ్యూస్‌ చేశారు. పాటలు, ఫైట్స్‌ లాంటివి తెలియని సున్నితమైన ఆకాశ్‌తో 'శరభ' లాంటి భారీ చిత్రం రూపొందించిన మా దర్శకుడు నరసింహ గారికి నా హ్యాట్సప్‌. ఇక హీరోయిన్‌ మిస్టీ చక్రవర్తి... బెంగాలీలో మిస్టీ దహీ అంటే స్వీట్‌ కర్డ్‌. ఈ మిస్టీ కూడా ఎంతో స్వీట్‌. ఆమె నవ్విందంటే అందరూ అన్ని టెన్షన్స్ మర్చిపోవచ్చు. భారీ గ్రాఫిక్స్ ఉన్న ఈ సినిమాలో తల్లి కొడుకు అనే ఎమోషన్‌ను ఇమడ్చటం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. మీరు బాహుబలి చూసుంటారు. అరుందతి చూసుంటారు. శరభ లాంటి సినిమాలు రావడానికి కూడా ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. ఇలాంటి చిత్రాలను ధైర్యం చేసి నిర్మించడం నరసింహా వంటి దర్శకుడికి మొదటి ఛాన్స్ ఇవ్వడం అనేది నిర్మాత గొప్పతనం. ప్రజలు దీన్ని ఆదరిస్తారనే గొప్ప ధైర్యం నాకుంది. 

చదలవాడ శ్రీనివాసరావు గారు స్నేహానికి ప్రతీక. పాతికేళ్లుగా ఆయనతో పరిచయం. ఫోన్‌ చేయగానే ఆయన ఈ సినిమాను రిలీజ్‌ వరకూ తీసుకొచ్చారు. నేను పెద్ద హీరోయిన్‌ను అనే భావనతో అంతా మాట్లాడారు ధన్యవాదాలు. కానీ ప్రతీ సినిమా నా జీవితంలో ఒక పరీక్ష. పాలిటిక్స్‌ నుంచి సినిమాల్లోకి రీఎంట్రి ఇద్దామనుకున్నప్పుడు ఇండస్ట్రీలో పాత పరిస్థితులు లేవు. ఇప్పుడు అంతా కొత్తవారే. అందుకే నేనూ ఓ కొత్తమ్మాయి తరహాలో ఇంట్రడ్యూస్‌ అవుతున్నాను. నా జీవితంలో కొత్త మలుపు శరభతో స్టార్ట్ అవుతోంది కాబట్టి నన్ను ఆశీర్వదించమని ప్రేక్షకులను కోరుతున్నాను' అన్నారు. 

ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి, డా. జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్, తనికెళ్ల భరణి, చరణ్ దీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: వేద వ్యాస్, రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, అనంత శ్రీరామ్, మేకప్: నాయుడు మరియు శివ, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్స్: రామ్- లక్ష్మణ్, డిజైనర్లు: అనిల్, భాను, కెమెరా: రమణ సాల్వ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆడియో గ్రఫీ: లక్ష్మీ నారాయణ ఎ ఎస్., మ్యూజిక్: కోటి, నిర్మాత: అశ్వని కుమార్ సహదేవ్, రచన-దర్శకత్వం: నరసింహ రావు



By November 11, 2018 at 09:23AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43442/sarabha-movie.html

No comments