Breaking News

అందుకే హీరోగా నిలబడలేకపోయా: జగ్గూభాయ్‌!


నిజానికి స్టార్‌ హీరో అనిపించుకోవడం ఎంత కష్టమో... నిజమైన నటుడు అనిపించుకోవడం కూడా అంతే. ఈ ఇద్దరూ రజనీకాంత్‌, కమల్‌హాసన్‌‌ల విషయంలో అది తెలుస్తుంది. ఇక తెలుగులో జగపతిబాబు ఫ్యామిలీ, మాస్‌ చిత్రాల ద్వారా కూడా హీరోగా తన సత్తా చాటాడు. ప్రఖ్యాత నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ కుమారుడిగా ఇండస్ట్రీకి ఎంటర్‌ అయినా తన సొంత బేనర్‌లో ఈయనకు ఒక్క చెప్పుకోదగిన విజయం కూడా లేదు. కానీ అదే సమయంలో బయటి బేనర్లు, దర్శకులతో ఎన్నో హిట్‌ చిత్రాలలో నటించి, ఫ్యామిలీ హీరోగా, లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. మొదటి నుంచి పాత్ర మంచిదైతే నటించడం అనేది ఆయన శైలి. అదే మొదట్లో ఆయనకు స్టార్‌ హీరోగా పేరు రావడానికి ఆటంకం అయినప్పటికీ ప్రస్తుతం ఆయనలోని వైవిధ్యం కోరుకునే గుణమో, విలన్‌గా, సపోర్టింగ్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆయనకు అన్ని భాషల్లో బిజీగా ఉండేలా చేసింది. 

తాజాగా ఆయనకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల వంటి మీకంటే సీనియర్లు ఇంకా హీరోలుగా రాణిస్తుండగా, మీరు మాత్రం ఇలా విలన్‌, క్యారెక్టర్‌, సపోర్టింగ్‌ ఆర్టిస్టుగా మారిపోవడానికి కారణం ఏమిటి? దాని గురించి మీకు మీరు ఎప్పుడైనా ఎనలైజ్‌ చేసుకున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ, నేను మొదటి నుంచి ఎవరితో ఎక్కువగా మాట్లాడే వాడిని కాను. బాగా పరిచయం ఉంటే తప్ప నలుగురిలో కలవలేను. అందరితో ర్యాపో లేకపోవడం వల్ల కూడా ఎదుటి వారు తొందరగా మర్చిపోయి అవకాశాలు తగ్గడానికి కారణం అవుతుంది. 

ఇక నా డ్యాన్స్‌, ఫైట్స్‌ వంటివి కూడా పెద్దగా నేను రాణించలేకపోవడానికి కారణం అయి ఉంటాయి. ఈ రెండు విభాగాలలో నాది పెద్ద గొప్పగా ఏమీ ఉండదు. నేను హీరోని అనుకోవడం కంటే నటుడిని అనిపించుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాను. వీటన్నింటి కారణంగా నేను ఎక్కువ కాలం హీరోగా రాణించలేకపోయి ఉండవచ్చు.. అని సమాధానం చెప్పుకొచ్చాడు. 



By November 09, 2018 at 11:48PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43420/jagapathi-babu.html

No comments