Breaking News

రవితేజ ఫ్యాన్స్‌లో ఆందోళన ఎందుకు?


మాస్ రాజా రవితేజ సినిమాలు ఓపెనింగ్స్ ఒక్కప్పుడు బాగుండేవి. కానీ ఈమధ్య కాలంలో ఫామ్ కోల్పోయిన రవితేజ.. ఈనెల 16న విడుదల అవుతున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కేవలం రెండు వారాలే ఈసినిమాకు టైం ఉన్నా ఇంతవరకు హైప్ కనిపించడం లేదు. దీంతో రవితేజ అభిమానుల్లో కాస్తంత ఆందోళన కనిపిస్తోంది. దీనికి కారణం ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీస్ వారి నుంచి తాజాగా వచ్చిన ‘సవ్యసాచి’ బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్నే చవిచూడటమే. దీని ఫలితం ఈసినిమా పైన పడే అవకాశం ఉందని వారు భావిస్తుండటం వల్లే ఆందోళన చెందుతున్నారు.

దీనికి తోడు 16న ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకోండ ‘టాక్సీవాలా’ కూడా రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలే ఈ ఏడాది రవితేజకి అంతగా కలిసి రాలేదు. అతను నటించిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’ దారుణ ఫలితాన్ని అందుకున్నాయి. ఇప్పుడొచ్చే ‘అమర్ అక్బర్ ఆంటొని’ మీద అంత నమ్మకంతో లేరు ప్రేక్షకుల్లో. సినిమా విడుదలై అద్భుతంగా ఉంది అని టాక్ వస్తే తప్ప బాక్సాఫీస్ దగ్గర నిలవడం కష్టం. రవితేజ ఎప్పుడు రొటీన్ కథలు ఎంచుకోవడం...ఎక్కువగా మాస్ ని టార్గెట్ చేయడం ఈ డిజాస్టర్స్‌కి కారణం.

ఇలా చేస్తే అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించడం కష్టమే. విఐ ఆనంద్‌తో ఓకే చేసిన కథకు డిస్కో డాన్సర్ అనే అవుట్ డేటెడ్ టైటిల్ అనుకుంటున్నారనే వార్త అభిమానులకు టెన్షన్ కలిగిస్తోంది. అసలే డాన్స్ లో వీక్ గా ఉన్న రవితేజ ఇలాంటివి చేయడం ఏంటి అన్న అనుమానాలు కూడా మొదలైపోయాయి. రవితేజ విభిన్న ప్రయత్నాలు చేయడం బెటర్ అని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. లేకపోతే కష్టమే అని వారి మాట.



By November 05, 2018 at 07:13AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43345/raviteja.html

No comments