Breaking News

రామ్ చరణ్‌ మంచి తమ్ముడంట...!


రామ్‌చరణ్‌కి బాలీవుడ్‌లో ‘జంజీర్‌’ (తుపాన్‌)లో నటించిన అనుభవమే కాదు.. బాలీవుడ్‌ స్టార్‌ అయిన సల్మాన్‌ఖాన్‌తో పాటు ఇతర ప్రముఖులతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం రామ్‌చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తోన్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రతినాయకునిగా బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ నటిస్తున్నాడు. ఈ మూవీకి ‘వినయ విధేయ రామా’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. దీపావళి కానుకగా టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, సంక్రాంతి బరిలో విడుదల చేయనున్నారు. ఇక బోయపాటి శ్రీను చిత్రాలలో ప్రతినాయకుని పాత్ర, వారి రేంజ్‌ ఏస్థాయిలో పవర్‌ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. హీరోయిజం ఎలివేట్‌ కావాలంటే అందుకు తన నటన సత్తాతో ఢీకొనే విలన్‌ కూడా ఉండాలనే బేసిక్స్‌ని బోయపాటి బాగా ఆచరిస్తాడు. 

ఇక బాలీవుడ్‌లో రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కంపెనీ’ చిత్రం ద్వారా పరిచయమైన వివేక్‌ ఒబేరాయ్‌ పలు బాలీవుడ్‌ చిత్రాలలో, మరీ ముఖ్యంగా వర్మ ఫ్యాక్టరీ చిత్రాల ద్వారా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వర్మ దర్శకత్వంలో పరిటాల రవి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘రక్తచరిత్ర’లో ఆయన పరిటాల పాత్రకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యాడు. ఇక ఇటీవల కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌-శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘వివేగం’ చిత్రంలో కూడా తన సత్తా చాటాడు. కాగా ఈయనకు సంబంధించిన రామ్‌చరణ్‌ చిత్రంలోని పాత్ర షూటింగ్‌ పూర్తయింది. 

ఈ సందర్భంగా వివేక్‌ ఒబేరాయ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించడం అనేది నాకు మరిచిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. కెమెరా ముందుకు వస్తే నేను రామ్‌చరణ్‌ బాగా ఫైట్స్‌, యాక్షన్‌సీన్స్‌ చేస్తాం. కెమెరా వెనుక మాత్రం అన్నదమ్ముళ్లులాగా ఎంతో అన్నోన్యంగా, ఆత్మీయంగా ఉండేవారం. ఈ సినిమాతో నేను చరణ్‌ అనే మంచి తమ్ముడిని సంపాదించుకోగలిగాను. చరణ్‌లోని కష్టపడేతత్వం.... ఆయన అంకిత భావం నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసేవి. చిరంజీవి గారిలోని మంచి లక్షణాలన్నీ నాకు చరణ్‌లో కనిపించేవి. చరణ్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. మా ఇద్దరి కాంబినేషన్‌కి మంచి మార్కులు పడతాయనే నమ్మకం ఉంది... అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంగా చెప్పుకొచ్చాడు. 



By November 06, 2018 at 01:17PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43372/vivek-oberoi.html

No comments