Breaking News

‘బాహుబలి’ తర్వాత స్థానం ‘రంగస్థలం’ది కాదు!


ఈ ఏడాది గొప్పగా చెప్పుకోదగ్గ హిట్స్ ఏమన్నా ఉన్నాయంటే... అవి ‘రంగస్థలం, మహానటి, గీత గోవిందం’ సినిమాలే. రామ్ చరణ్ - సుకుమార్‌లు ‘రంగస్థలం’తో టాలీవుడ్ లో నాన్ ‘బాహుబలి’ రికార్డులను క్రియేట్ చేశారు. అనేక రికార్డులకు ‘బాహుబలి’ తర్వాత స్థానంలో రంగస్థలమే నిలిచింది. రామ్ చరణ్ చిట్టిబాబుగా అదరగొట్టాడు. అరవై రోజులకే డిజిటల్ అమెజాన్ ప్రైమ్‌లో ‘రంగస్థలం’ సినిమా వచ్చేసినప్పటికీ... బోలెడంత ధర పోసి శాటిలైట్ హక్కులను దక్కించుకున్న స్టార్ మా ఛానల్.. ‘రంగస్థలం’ సినిమా ప్రసారం చేసిన రోజున కూడా టీఆర్పీ రేటింగ్స్ లో ‘బాహుబలి’ తర్వాత స్థానంలోనే ‘రంగస్థలం’ నిలిచింది. స్టార్ మాలో ప్రసారమైన ‘రంగస్థలం’ 19.5 రేటింగ్‌తో బాహుబలి తర్వాత స్థానంలో నిలిచినప్పటికీ అదొక రికార్డుగానే పరిగణించబడింది.

ఇక ‘మహానటి’ సంగతి అలా ఉంచితే ఈ ఏడాది చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కి 100 కోట్ల క్లబ్బులోకి వెళ్లిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్. విజయ్ దేవరకొండ - పరశురామ్ లు చాలా తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా చేశారు. సినిమాలో కామెడీ కంటెంట్, విజయ్ దేవరకొండ ఇన్నోసెన్స్ అన్ని ప్రేక్షకులకు బాగా నచ్చాయి. థియేటర్స్‌లో ‘గీత గోవిందం’ సినిమా స్టార్ హీరోల సినిమాలకు పోటీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. అలాంటి సినిమాని ఈమధ్యనే జీ తెలుగు ఛానల్ వారు ప్రసారం చెయ్యగా... 20.7 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ‘రంగస్థలం’ సినిమాని తలదన్నేలా ‘గీత గోవిందం’ టీఆర్పీ రేటింగ్ వచ్చిందంటే ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో తెలుస్తుంది.

‘బాహుబలి’ తర్వాత స్థానంలో ఉన్న చిట్టిబాబు రంగస్థలాన్ని విజయ్ ‘గీత గోవిందం’ బీట్ చేసింది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు మెచ్చిన చిత్రాల్లో ‘బాహుబలి’ తర్వాత స్థానంలో ‘గీత గోవిందం’ ఉంటే... ఆ తర్వాత స్థానంలో ‘రంగస్థలం’ ఉంది. మరి చిట్టిబాబుని అలా గోవిందం క్రాస్ చేసేసాడన్నమాట. నిజంగా ఇది మాత్రం సూపర్ న్యూస్. భారీ బడ్జెట్ చిత్రం భారీ క్రేజున్న చిత్రాన్ని బుల్లి సినిమాగా వచ్చిన గీత గోవిందం బీట్ చేయడం అంటే నిజంగా సూపరంటే సూపరే మరి.



By November 17, 2018 at 03:47AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43523/geetha-govindham.html

No comments