Breaking News

‘ఆర్‌ఆర్‌ఆర్’ అస్సలు కాంప్రమైజ్ కాను: దానయ్య


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో.. బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌గానే సినిమా ప్రారంభం కాక ముందు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని మెగాభిమానులు, నంద‌మూరి అభిమానులు ఆస‌క్తితో ఎదురుచూస్తుండ‌గా ఆరోజు రానే వ‌చ్చింది. ముందుగానే ప్ర‌క‌టించిన విధంగా న‌వంబ‌ర్ 11న సినీ ప్ర‌ముఖుల స‌మక్షంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఘ‌నంగా ప్రారంభ‌మైంది. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి భారీ బ‌డ్జెట్‌తో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తోఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ ప్రారంభోత్స‌వ‌ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, రానా, క‌ల్యాణ్ రామ్‌, కొర‌టాల శివ‌, వంశీ పైడిప‌ల్లి, బోయపాటి శ్రీను, వెంకీ అట్లూరి, మెహ‌ర్ ర‌మేశ్, దిల్‌రాజు, అల్లు అర‌వింద్, పివిపి, శోభు యార్ల‌గ‌డ్డ‌, యు.వి వంశీ, యు.వి విక్ర‌మ్‌, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, కె.ఎల్‌.నారాయ‌ణ‌, డి.సురేశ్ బాబు, ఎం.ఎల్‌.కుమార్ చౌద‌రి, న‌వీన్ ఎర్నేని, సి.వి.మోహ‌న్‌, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, ప‌రుచూరి ప్ర‌సాద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, సాయికొర్రపాటి, గుణ్ణం గంగ‌రాజు త‌దిత‌రులు ముఖ్య‌ అతిథులుగా విచ్చేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్ట‌గా వి.వి.వినాయ‌క్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. 

ఈ సంద‌ర్భంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ.. ‘‘మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ టాలీవుడ్‌ను మా బ్యాన‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో.. తెలుగు సినిమా స‌త్తాను బాహుబ‌లితో ప్ర‌పంచానికి చాటిన ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిగారి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డం ఓ డ్రీమ్‌లాగా ఉంది. సినిమాపై ఇప్ప‌టి నుండే భారీ అంచ‌నాలున్నాయి. నంద‌మూరి అభిమానులు, మెగాభిమానులు సినిమా కోసం ఎంత అతృత‌గా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా మేకింగ్‌లో కాంప్ర‌మైజ్ కాకుండా .. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్ర‌పంచానికి చాటేంత గొప్ప సాంకేతిక విలువ‌ల‌తో సినిమాను భారీగా రూపొందిస్తాను. అన్ కాంప్ర‌మైజ్‌డ్‌గా చేయ‌బోయే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ నవంబ‌ర్ 19 నుండి స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ సెట్‌లో రెండు వారాల పాటు ఈ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో చేయ‌బోయే మిగ‌తా న‌టీన‌టులు వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం..’’ అన్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ చిత్రానికి మాట‌లు:  సాయిమాధ‌వ్ బుర్రా, క‌ర్కీ, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ర‌మా రాజ‌మౌళి. ఎడిట‌ర్‌:శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ విజ‌న్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌, మ్యూజిక్‌:  ఎం.ఎం.కీర‌వాణి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  సాబు సిరిల్‌, సినిమాటోగ్ర‌ఫీ:  కె.కె.సెంథిల్‌కుమార్‌, క‌థ‌: వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.By November 12, 2018 at 07:47AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43457/rrr-movie.html

No comments