రజినీ మూవీ ఆగిపోయింది.. అజిత్‌కి పండగే!!
సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో 'పెట్టా' అనే సినిమా చేస్తున్నాడనే సంగతి తెల్సిందే. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన మోషన్ టీజర్ లో తలైవా రజినీకాంత్ గెటప్ ఒక రేంజ్ లో ఉండటంతో ఈసినిమా కోసం అటు తమిళ ప్రేక్షులతో పాటు..తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చేస్తున్నారు. ముందు నుండే ఈ సినిమాను సంక్రాంతికి తీసుకుని రావాలని అనుకున్నారు మేకర్స్. కానీ తాజా అప్ డేట్ ప్రకారం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.
మార్చి లేదా సమ్మర్ లో ఈ సినిమాను తీసుకుని రావాలని చూస్తున్నారు. దానికి కారణం.. రజిని నటించిన 2.0 నవంబర్ 29న భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. ఈసినిమాకు 'పెట్టా'కు కేవలం 45 రోజుల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. సో అలా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ మీద ప్రభావం ఉంటుందని పోస్ట్ పోన్ చేయనున్నారు. అలానే రజిని గత సినిమా 'కాలా' జూన్ లో వచ్చింది. సో ఎనిమిది నెలల కాలంలో మూడు రజనీకాంత్ సినిమాలు వచ్చినట్టు అవుతుందని 'పెట్టా'ను వాయిదా వేయాలని చూస్తున్నారు.
వాయిదాకు మరో కారణం టాలీవుడ్. టాలీవుడ్ ఈ సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'ఎన్టీఆర్' బయోపిక్.. 'వినయ విధేయ రామ',.. 'ఎఫ్ 2' వంటి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నందున ఎందుకైనా మంచిది అని అలోచించి తమిళ నిర్మాతలు సేఫ్ డేట్ కోసం మార్చబోతున్నట్టు సమాచారం. ఇది కనుక నిజం అయితే అజిత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే. ఎందుకంటే 'విశ్వాసం'ని పొంగల్ గిఫ్ట్ అని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. సో రజిని పొంగల్ రేస్ లో లేకపోతే అజిత్ బాక్స్ ఆఫీస్ ని దున్నేయొచ్చు.
By November 14, 2018 at 09:17AM
No comments