Breaking News

శృతికి అతను లేనిదే నిద్రపట్టేలా లేదు!


బాలీవుడ్‌లోని స్టార్స్‌ ఒక్కొక్కరుగా ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఆఖరి నిమిషం వరకు తాము స్నేహితులమేనని నమ్మించే ప్రయత్నం చేస్తూనే గుట్టు చప్పుడు కాకుండా ఒక ఇంటి వారు అయిపోతున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూడటం లేదనే విధంగా ఈ వ్యవహారం సాగుతోంది. అయినా కక్కు వచ్చినా, కళ్యాణం వచ్చినా ఆగదు అనేది నిజం. ఇక ఏ విషయాన్ని ఎల్లకాలం దాచాలంటే దాగదు. ఇక ప్రియాంకాచోప్రా నుంచి శృతిహాసన్‌, ఇలియానా వంటి వారు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. 

కమల్‌హాసన్‌-సారికల పెద్ద కుమార్తె అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి శృతిహాసన్‌ కూడా గత కొంతకాలంగా సినిమాలను పక్కనపెట్టి మరీ తన ప్రియుడు, తన మ్యూజికల్‌ ట్రూప్‌లోని లండన్‌కి చెందిన మైఖేల్‌ కోర్స్‌లేతో పీకల్లోతు ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. వీరు విమానాశ్రయాల నుంచి బహిరంగ ప్రదేశాలలో కూడా పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ, హగ్‌ చేసుకుంటూ మీడియాకు దొరికారు. ఇక మైఖేల్‌ లేనిదే శృతిహాసన్‌ తట్టుకోలేదని అంటారు. అందుకే మైఖేల్‌ తరచు ముంబై రావడమో, లేక శృతిహాసన్‌ లండన్‌కి వెళ్లడమో తరుచుగా చేస్తూనే ఉంటారు. 

ఆ మధ్య తన తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి మైఖేల్‌, శృతిలు ఓ పెళ్లికి కూడా హాజరయ్యారు. మరోవైపు మైఖేల్‌ని శృతి ఆల్‌రెడీ కమల్‌కేకాదు.. తల్లి సారికాకు కూడా పరిచయం చేసింది. ఇంత జరిగినా శృతి మాత్రం ఇప్పటికీ తామిద్దం కేవలం స్నేహితులమేనని, తమ మధ్య ప్రేమ లేదని వాదిస్తోంది. కానీ ఆయన మాత్రం తనకు ఫ్రెండ్‌ కంటే ఎక్కువ అని చెబుతూ, ‘నేను వైఫై కంటే ఎక్కువగా మైఖేల్‌ని ప్రేమిస్తున్నాను’ అనే అర్ధం వచ్చేలా ఓ ఫొటోను ఆమె పోస్ట్‌ చేసింది. 

ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ప్రజలు వైఫై లేకుండా ఉంటే ఎంతగా అల్లాడిపోతారో మైఖేల్‌ లేని శృతి కూడా అంతలా అల్లాడిపోతుందనేది ఆమె ఉద్దేశ్యమని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక ఈమె చాలా గ్యాప్‌ తర్వాత బాలీవుడ్‌లో విద్యుత్‌జమాల్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. దీనికి మహేష్‌మంజ్రేకర్‌ దర్శకుడు.



By November 02, 2018 at 05:44AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43299/shruti-haasan.html

No comments