‘కవచం’ టీజర్ వచ్చేస్తోంది
నవంబర్ 12న బెల్లంకొండ శ్రీనివాస్ కవచం టీజర్ విడుదల..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం కవచం. ఈ చిత్ర టీజర్ నవంబర్ 12న విడుదల కానుంది. దీవాళికి విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. మెహ్రీన్ కౌర్, హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కవచం షూటింగ్ పూర్తయింది. కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని(నాని) కవచం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీనివాస్
నిర్మాత: నవీన్ సొంటినేని
నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్
సహ నిర్మాత: చాగంటి సంతయ్య
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్: ఛోటా కే నాయుడు
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: చిన్నా
పిఆర్ఓ: వంశీ శేఖర్
By November 12, 2018 at 07:37AM
No comments