‘యాత్ర’లో అనసూయ లుక్ చూశారా?
టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడస్తోంది. మహానటి సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ‘మహానటి’ చిత్రం ఘనవిజయం అందుకోవడంతో.. మరిన్ని బయోపిక్‌లకు మార్గం సుగమమం అయింది. బాలయ్య ‘ఎన్టీఆర్’ అంటూ రెండు రకాలుగా ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ అనే టైటిల్‌తో మరో బయోపిక్ సెట్స్‌పై ఉంది. ఇవిగాక మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సెట్స్‌పై ఉంది. ఇవిగాక ఎన్టీఆర్ పేరుమీద మరో రెండు బయోపిక్‌లు, మహా గాయకుడు ‘ఘంటసాల’ బయోపిక్‌లు కూడా తెరకెక్కుతున్నాయి. ఇంకో నెల తర్వాత టాలీవుడ్‌లో ఈ బయోపిక్‌ల గురించే చర్చలు జరుగుతాయంటే అతిశయోక్తి కాదేమో..!
ఇక విషయంలోకి వస్తే వైఎస్‌ఆర్ బయోపిక్ ‘యాత్ర’ చిత్రంలో వైఎస్‌ఆర్‌గా మమ్ముట్టి నటిస్తున్నాడు అనగానే.. ఈ చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొంది. మహి.వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని, శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రతీది హాట్ టాపిక్‌గానే మారుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో యాంకర్, నటి అనసూయ కూడా ప్రధాన పాత్రలో నటిస్తుంది.
ఇప్పటి వరకు ఈ విషయం రివీల్ చేయకపోయినా.. అనసూయే తన పాత్రకు సంబంధించిన స్టిల్‌ని తన ట్విట్టర్‌లో షేర్ చేసి.. ‘యాత్ర’లో నేనూ ఉన్నానంటూ హిట్ ఇచ్చేసింది. అయితే ఆమె ఈ చిత్రంలో ఎవరి పాత్ర పోషిస్తుందనే విషయం మాత్రం చెప్పలేదు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనాలను క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే వైవిధ్యమైన పాత్ర అయితే నటించే అనసూయ.. ఇందులో ఎటువంటి పాత్ర చేస్తుందో అనే క్యూరియాసిటీ ఇప్పుడందరిలో ఉంది.
By November 16, 2018 at 04:15AM
No comments