Breaking News

‘కవచం’ ఫస్ట్ లుక్ అదిరింది


బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ ఫస్ట్ లుక్ విడుదల..

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘కవచం’ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఖాకీ డ్రస్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తుండగా తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం విశేషం. థ్రిల్లర్ మూవీ‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.

ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న ఈ సినిమాని నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 



By November 10, 2018 at 03:32PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43436/bellamkonda-sreenivas.html

No comments