Breaking News

వివాదంలో ‘దీప్‌వీర్’ పెళ్లితంతు..!


మీడియా, సినిమాలు, ప్రముఖులు ఏ పని చేసినా పూర్తిగా తెలుసుకుని చేయాలి. లేకపోతే మత విశ్వాసాలు దెబ్బతిని వారి చుట్టూ వివాదాలు చుట్టుముడుతుంటాయి. చాలా ఏళ్లకిందట కమ్యూనిస్ట్‌ నాయకుడు సుర్జీత్‌సింగ్‌ మీద ఈనాడు శ్రీధర్‌ కార్టూన్‌ గీస్తూ, సిక్కు అయిన వ్యక్తి చేతిలో కత్తితో గడ్డం గీస్తున్నట్లు చూపించాడు. సాధారణంగా సిక్కులు జుట్టు కత్తిరించరు. ఇది వారి మత సంప్రదాయాలకు అతీతం కావడంతో హైదరాబాద్‌లోని ఈనాడు ఆఫీస్‌ని సిక్కులు చుట్టుముట్టడం, తర్వాతి రోజు ఈనాడు పత్రిక సిక్కులకు క్షమాపణ చెప్పడం జరిగాయి. 

ఇక ఇటీవల షారుఖ్‌ఖాన్‌ నటించిన ‘జీరో’ ట్రైలర్‌ కూడా సిక్కు మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉందని గోల గోల జరిగింది. ఇక ఇప్పుడు మరో వివాదం మొదలైంది. బాలీవుడ్‌ హాట్‌ పుల్‌ అయిన రణవీర్‌సింగ్‌, దీపికాపడుకొనేలు ఇటలీలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈనెల 14,15 తేదీలలో ఇటలీలోని లేక్‌కెమోలోని విల్లా డెల్‌ బాల్బియానెల్లోలో వీరు వివాహం చేసుకున్నారు. తొలుత కొంకణీ సంప్రదాయంలో, 15న సింధీ సంప్రదాయంలో ఒక్కటయ్యారు. పెళ్లి సందర్భంగా జరిగిన ‘ఆనంద్‌ కరాజ్‌’ కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆనంద్‌ కరాజ్‌ కార్యక్రమం సిక్కు సంప్రదాయాలకు విరుద్దంగా జరిగిందని ఇటాలిజన్‌ సిక్కు ఆర్గనైజేషన్‌ ఆరోపించింది. సిక్కుల పరమ పవిత్ర గ్రంధమైన ‘గురుగ్రంథ్‌ సాహెబ్‌’ని మహాద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదన్న నిబంధనను వారు అతిక్రమించారని సంఘ అధ్యక్షుడు ఆరోపించారు. సిక్కుల కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ని ఉల్లఘించి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయాన్ని ‘అకల్‌ తఖ్త్‌ జతేదార్‌’ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు చెప్పారు. దీనిపై ఫిర్యాదు నమోదైన వెంటనే ఐదుగురు అత్యున్నత మత పెద్దల వద్దకు విషయాన్ని తీసుకెళ్లనున్నట్లు అకల్‌ తఖ్త్‌ జతేదార్‌ తెలిపారు. ఇక ఇటలీ నుంచి ఆదివారమే ముంబై చేరుకున్న రణవీర్‌, దీపికా జంట రిసెప్షన్ల ఏర్పాటులో బిజీగా ఉన్నారు. ముంబై, బెంగుళూరులలో మొత్తం మూడు వివాహ విందులు ఏర్పాటు చేస్తున్నారు. 



By November 21, 2018 at 01:02PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43584/deepika-padukone.html

No comments