Breaking News

‘అమర్ అక్బర్ ఆంటొని’పై అలిగాడా ఏంటి?


మొదటి నుండి శ్రీను వైట్ల సినిమాలంటే కామెడీ దండిగా ఉంటుంది. ‘రెడీ, ఢీ, దూకుడు, దుబాయ్ శీను, బాద్ షా’ ఇలా అన్ని సినిమాల్లో శ్రీను వైట్ల కామెడికే పెద్ద పీట వేశాడు. ఈసారి కూడా శ్రీను వైట్ల కామెడీని బాగా నమ్ముకున్నట్టుగానే కనబడుతుంది. మిస్టర్ తర్వాత మాయమైన శ్రీను వైట్ల చాలా రోజులకి రవితేజతో కలిసి సక్సెస్ ట్రాక్ ఎక్కటానికి అమర్ అక్బర్ ఆంటొనితో తీవ్రంగా కష్టపడ్డాడు. ఈ రోజు విడుదలైన అమర్ అక్బర్ ఆంటొని సినిమా హిట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ కి ఒక పెద్ద క్యారెక్టర్ శ్రీను వైట్ల ఇచ్చాడని.. ఈ సినిమాతో సునీల్ కి మంచి పేరొచ్చి ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడతాయనే టాక్ నడిచింది. అరవింద సమేత సినిమాలో నీలాంబరిగా కథకు తగ్గ కామెడీ చేసిన సునీల్ కి ఆ సినిమాతో వచ్చిపడింది ఏమి లేదు. అయితే సునీల్ మాత్రం ఈ అమర్ అక్బర్ ఆంటోని సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో సునీల్ కి శ్రీను వైట్ల ఫుల్ లెన్త్ రోల్ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా... సెకండ్ హాఫ్ లో సునీల్ జాయిన్ అవుతాడని.... అతని పేరు బేబీ సిట్టర్ బాబీ.. ఈ పాత్ర ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.. అని చెప్పాడు. అయితే ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లుగా కనబడుతుంది సునీల్ వ్యవహారం. ఎందుకంటే సునీల్ పాత్ర బావుంటే గనక.. సునీల్ అమర్ అక్బర్ ఆంటోని కమెడియన్ ప్రెస్ మీట్ కి హాజరవ్వాలి. కానీ ఈ అమర్ అక్బర్ ఆంటొని కమెడియన్స్ ప్రెస్ మీట్ కి హాజరవలేదు. అలాగే ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి సింగిల్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. మరి సునీల్ పాత్ర అమర్ అక్బర్ ఆంటొనిలో పెద్దగా లేదా.. అందుకే సునీల్ అలిగాడా...? ఏమో ఏదైనా గాని మీడియాలో అమర్ అక్బర్ ఆంటొని హీరో, హీరోయిన్, దర్శకుడు హడావిడి తప్ప కమెడియన్ సునీల్ సందడి ఎక్కడా కనబడడం లేదు. అరవింద సమేత చిన్న పాత్రకే సునీల్ అప్పట్లో ఎంతగా హడావిడి చేశాడో వేరే చెప్పక్కర్లేదు.



By November 17, 2018 at 05:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43525/amar-akbar-antony.html

No comments