Breaking News

‘2.ఓ’లోని పాటకు కింగ్ నాగ్ ఫిదా!!


సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.ఓ’. ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.వి.ఆర్. సినిమాస్ ద్వారా ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ విడుదల చేస్తున్నారు. 

ఈ చిత్రంలోని ‘బుల్లిగువ్వా..’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆలపించారు. ఈ పాట తనకెంతో బాగా నచ్చిందని కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చాలా క్లాస్‌గా ఉందంటూ ప్రశంసించారు.



By November 13, 2018 at 01:46PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43474/king-nagarjuna.html

No comments