డోర్ వేసి 20 నిమిషాలు మాట్లాడారు: విజయ్!
గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా....రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ అంచనాల్ని మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. ఈ వేడుకకు 'సదరన్ స్టార్' అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషం. టాక్సీవాలా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.... మంచి ప్రశంసలు అందుకుంది. యు బై ఏ సర్టిఫికెట్ తో టాక్సీవాలా నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం జెఆర్‌సిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా జరుపుకున్న సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బన్నీ అన్నకి చాలా థ్యాంక్స్. పెళ్ళిచూపులు తర్వాత నన్ను పిలిచి మాట్లాడారు. అర్జున్‌రెడ్డి సినిమా చేసినప్పుడు కూడా గీతాఆర్ట్స్ ఆఫీస్‌కి పిలిచి డోర్ వేసి 20 నిమిషాలు మాట్లాడారు. గీతగోవిందం టైంలో కూడా నా పక్కన కూర్చుని మాట్లాడారు. థ్యాంక్యూ అన్న నాకు మీరు ఇంత సపోర్ట్ అందిస్తున్నందుకు. నేను మొన్న మొన్నే వచ్చా నేను చేసిన సినిమాలు వేళ్ళపైన లెక్కపెట్టవచ్చు. బన్నీ అన్నలాగా డాన్స్ నేను చెయ్యలేను. నేను మీకు ఎందుకు నచ్చుతున్నానో నాకు తెలియడం లేదు. నేను చేసే సినిమాలు మీకు నచ్చి ఉంటాయి నన్ను ఇష్టపడడానికి కారణం. మనకు ఉన్నది మన ధ్యైర్యం, మన కష్టం. దాని పైనే పైకి రావొచ్చు. గీతాఆర్ట్స్ వాళ్ళు నాకు దారిని చూపించారు. ఎలాంటి సినిమాలు చెయ్యాలని నాకు గైడెన్స్ ఇచ్చారు. విష్ణు నా ఫ్రెండ్ హాలీవుడ్ అనే రోల్ చేశాడు. చాలా బాగా చేశాడు. చాలా ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. సాయి రైటర్ మనోడు సినిమా స్టార్ట్ అయ్యేముందు పొలం అమ్మకానికి పెట్టాడు. ప్రొడక్షన్ నుంచి డబ్బులు రాగానే పక్కన పెట్టాడు. సాయి గ్రేట్ రైటర్. ప్రియాంక ఈమె అనంతపూర్ యాక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చింది. ఆడిషన్స్‌కి ఇచ్చి మూవీకి సెలెక్ట్ అయింది. ఈ సినిమా కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తుంది.
రాహుల్ కూడా ఇంజనీరింగ్ చదువుతూ ఫిలిం మేకింగ్ గురించి ఇంటర్నెట్‌కి వెళ్లి మేకింగ్ గురించి చదువుతూ నేర్చుకున్నాడు. చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తన కెరీర్ సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. సుజిత్ కెమెరామెన్ తను నెక్ ప్రాబ్లమ్‌తో ఉన్నాడు. నాకోసం బెల్ట్ వేసుకుని కష్టపడి చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. జేక్స్ వాళ్ళ ఫాదర్ క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. అయినా చాలా కష్టపడ్డారు. సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్మెంట్ కాని.. దాని వెనకాల చాలా మంది జీవితాలు ఉంటాయి. నేనెప్పుడూ ఎవర్నీ ఏమీ అడగలేదు. అందరూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా థియేటర్స్‌కి వెళ్ళి చూడండి. ఎవ్వరూ పైరసీ చెయ్యకండి ప్లీజ్ అందరూ చూడండి. వంశీ అన్న, అరవింద్‌గారు మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్యూ అని అన్నారు.
By November 13, 2018 at 05:20AM
No comments