RX 100 Hero Fired on Allegations | 'ఆర్‌ఎక్స్ 100' హీరోకి కోపమొచ్చింది..!
ప్రతి వాదనకి, సమస్యలు నాణేనికి ఉన్నట్లు బొమ్మ, బొరుసు అనే రెండు కోణాలు ఉంటాయి. అంతే గానీ ఆ విషయంలో ఒకరిదే తప్పు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మేజర్ కాని పిల్లలకు మద్యం, సిగరెట్లు అమ్మడం నేరం. కానీ ఈ తప్పు వాటిని తీసుకుంటున్న తెలిసి తెలియని వయసు పిల్లలదా? సమాజానిదా? పోలీసులదా? ఇతర అధికారులదా? తల్లిదండ్రులు, పెద్దలదా? అనేది తేలాల్సిన విషయం. దీనిలో సమాజంలోని అందరి బాధ్యత చివరకు మీడియా బాధ్యత కూడా ఎంతో ఉంది. సినిమాలకు సెన్సార్ పెట్టింది.. 'ఎ, యు/ఎ, క్లీన్‌యు' అనే సర్టిఫికేట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఎ సర్టిఫికేట్ చిత్రాలకు పిల్లలు కూడా వచ్చి చూస్తున్నారంటే పెద్దలు, సమాజం, థియేటర్ల యాజమాన్యం వంటి అందరిదీ తప్పే. సమాజంలో చెడు వ్యాపించినంత వేగంగా, మంచి ఎవ్వరి మనసులకు ఎక్కదు. శివ చిత్రం చూసి ఎందరు కాలేజీ స్టూడెంట్స్ చెడిపోయారు? అనే దానిపై విశ్లేషణ చేస్తే 'శంకరాభరణం, సాగరసంగమం' వంటి వాటిని చూసి ఎందరు ప్రభావితులయ్యారు? అంటే సమాధానం లేదు.
ఇక విషయానికి వస్తే ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన 'ఆర్‌ఎక్స్ 100' చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సంఘటనను చూసి ప్రభావితం అయిన ఇద్దరు పదోతరగతి చదివే మైనర్ బాలురు ఒక క్లాస్‌లోని అమ్మాయిని ప్రేమించి, ఇంట్లో వారికి తెలుస్తుందని భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, మీడియా దీనికి 'ఆర్‌ఎక్స్ 100' చిత్రం ప్రేరణే కారణమని చెప్పారు. దీనిపై హీరో కార్తికేయ మాట్లాడుతూ, తాము కళాకారులమే గానీ టెర్రరిస్ట్‌లం కాదు. పోలీసులు, మీడియా ఈ విషయంలో తమని నేరస్తులుగా చూపుతోంది. ఈ చిత్రంలో పాటలో హీరో ఎక్కడా చనిపోడు. హీరోయిన్ ఇందు అనే పాత్ర ప్లాన్ ప్రకారం హత్య చేయిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరించారు.
'పిల్లారా' పాటను ఎంతగానో ఎంజాయ్ చేశారు. సినిమాలంటే రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి. ప్రజలు చనిపోవాలని ఏ ఆర్టిస్టు కోరుకోడు. ఇద్దరు పిల్లలు చెడుదారిలో నడుస్తుంటే వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ఇలాంటి బాధాకరమైన సంఘటలను నెగటివ్‌గా చూపడం మాని, సన్మార్గంలో నడిచేలా చేయాలి.. అని తెలిపాడు. మరోవైపు వర్మ శిష్యుడైన దర్శకుడు భూపతి ఇది 'ఎ'సర్టిఫేకేట్ చిత్రమని మర్చిపోవద్దని చెప్పడం కూడా కరెక్టే.
By October 06, 2018 at 12:44PM
Read More
No comments