Breaking News

RRR విషయంలో ఇది గుడ్ డెసిషన్..!!


బాలీవుడ్‌లో ఎప్పటినుంచో మంచి ట్రెండ్‌ ఉంది. అమీర్‌ఖాన్‌ వంటి వారు ఏ చిత్రంలో నటించినా పారితోషికం తీసుకోరు. లైట్‌బోయ్‌ వరకు అందరికీ రెమ్యూనరేషన్స్‌ ఇచ్చిన తర్వాత వచ్చే లాభాలలో వాటా అందుకుంటూ ఉంటారు. దీని వల్ల నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుంది. హిట్స్‌, ఫ్లాప్స్‌ల ఆర్ధికభారం నిర్మాతలపై తక్కువలో ప్రభావం చూపిస్తుంది. సినీ బడ్జెట్‌లో సగం నేటి స్టార్స్‌కే సరిపోతోంది. అందువల్ల లాభాలలో వాటా అంటే అది హీరోలు కూడా బాధ్యతగా ఫీలయ్యేలా చేయడమే కాదు...మంచి హిట్‌ కొడితే మామూలు రెమ్యూనరేషన్‌ కన్నా ఎక్కువ మొత్తం ముడుతాయి. అదే సమయంలో ఫ్లాప్‌చిత్రాల విషయంలో కూడా హీరోలకు బాధ్యతను పెంచేందుకు ఇది సహాయపడుతుంది.

ఇక నేడు బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌, టాలీవుడ్‌ వరకు చాలా మంది స్టార్స్‌ తమకి హోమ్‌బేనర్‌ ఉండేలా, మరో స్నేహితుల బేనర్లలోనే వాటా ఉండేలా చూసుకుంటున్నారు. ఇది కూడా మంచి పరిణామమే. ఇక ‘దబాంగ్‌ నుంచి బాహుబలి’ వరకు అందరు ఇలా వాటాలు తీసుకుని భారీగా లాభాలు అందుకున్నారు. రాజమౌళి, ప్రభాస్‌ వంటి వారు ఎన్నో ఏళ్లు వెచ్చించి చేసిన ‘బాహుబలి’ చిత్రం ద్వారా లాభాలలో వాటా ద్వారా వీరికి పెద్దమొత్తాలు అందాయి. ఇక ఇప్పుడు అదే రాజమౌళి.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో చేయబోయే మల్టీస్టారర్‌ విషయంలో జక్కన్న, ఎన్టీఆర్‌, చరణ్‌లు పారితోషికం కాకుండా లాభాలలో వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఈ చిత్రం కోసం ఈ ముగ్గురు 200రోజుల భారీ కాల్షీట్స్‌ ఇచ్చారు. కాబట్టి దానికి తగ్గట్లు పారితోషికం తీసుకుంటే నిర్మాతకు తడిసి మోపెడు అవుతుంది. అందుకే వీరు వాటా తీసుకోవడం వల్ల ఈ చిత్రం ద్వారా ఈ ముగ్గురిలో ఒక్కొక్కరికి కనీసం 50కోట్లకు పైగానే ముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు వాటాలు పోను మిగిలింది నిర్మాత దానయ్యకు సొంతం అవుతుంది.



By October 26, 2018 at 11:00AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43197/rajamouli.html

No comments